వైష్ణోదేవి యాత్రలో పెను ప్రమాదం.. విరిగిపడిన కొండచరియలు
జమ్మూలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మాతా వైష్ణోదేవి యాత్ర మార్గంలో కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఈ ఘటన అర్ధకుమారి సమీపంలో జరిగింది. ఈ మార్గంలో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తుంటారు. కొండపై నుంచి పెద్ద రాళ్లు, మట్టి ఒక్కసారిగా రోడ్డుపై పడటంతో పలువురు భక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం కట్రాలోని ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే దేవస్థాన బోర్డు, భద్రతా బలగాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. యాత్ర మార్గంలో ఉన్న భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానిక యంత్రాంగం, పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. కొండచరియలు విరిగిపడిన తర్వాత రోడ్డుపై పడి ఉన్న రాళ్లు, మట్టి పోటోలు కూడా విడుదలయ్యాయి. భద్రతా సిబ్బంది తాళ్లు, బారికేడ్ల సహాయంతో భక్తులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

వైష్ణోదేవి యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
భక్తుల భద్రత దృష్ట్యా మాతా వైష్ణోదేవి యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. అర్ధకుమారి నుంచి భవన్ వరకు ఉన్న మార్గాన్ని మూసివేశారు. లోపలి మార్గం ద్వారా కూడా భక్తుల రాకపోకలను నియంత్రించారు. ప్రస్తుతం యాత్రలో ఉన్న భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి ఆశ్రయం కల్పించారు.
భారీ వర్షాలతో దిగజారుతున్న పరిస్థితులు
గత 48 గంటలుగా జమ్మూ, కశ్మీర్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే ఐదు గంటల పాటు జమ్మూ-కశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కట్రా, జమ్మూ, సాంబ, రియాసి, ఉధంపూర్, దోడా, కిష్త్వార్ జిల్లాల్లో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఉప్పొంగిన తవి నది
ఉధంపూర్‌లో తవి నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దీని ప్రస్తుత నీటి మట్టం 2014 నాటి వరదల స్థాయిని కూడా అధిగమించింది. రాబోయే కొన్ని గంటల్లో జమ్మూ నగరంలో నది నీటి మట్టం మరో 7-10 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.జమ్మూ డీఐజీ శివ కుమార్ శర్మ మాట్లాడుతూ.. జమ్మూ డివిజన్ మొత్తానికి వరద హెచ్చరికలు జారీ చేశామని, ప్రజలు నదులు, కాలువలకు దూరంగా ఉండాలని కోరారు. పరిస్థితిని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా శ్రీనగర్ నుంచి జమ్మూకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications