ఎక్స్‌ప్రెస్‌వేపై కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి
ముంబై: ముంబై బోర్‌ఘాట్ ప్రాంతంలోని ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం మధ్నాహ్నం కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఆ సమయంలో రోడ్డుపై వెళుతున్న ఓ కారు, మరో రెండు వాహనాలపై రాళ్లు పడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రహదారిపై బండరాళ్లు పేరుకుపోవడంతో ఆ రహదారిని మూసివేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. రాళ్లను తొలగించిన తర్వత తిరిగి తెరిచే అవకాశం ఉంది.
భవనంకూలిన ఘటనలో 6కు చేరినమృతుల సంఖ్య

దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం రాత్రి జరిగిన భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. పశ్చిమ ఢిల్లీలోని విష్ణు గార్డెన్ ప్రాంతంలో నాలుగు అంతస్థుల భవనం నేల కూలిన విషయం తెలిసిందే.
ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఖాళీగా ఉన్న స్థలంలో భవన నిర్మాణం కోసం తవ్వుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మాజీ కేంద్ర మంత్రి అజయ్ మాకెన్ ఆదివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications