కలకలం: ట్రంప్ సీక్రెట్ సర్వీస్ ల్యాప్‌టాప్ చోరీ.. ఎవరి పనై ఉంటుంది?

Subscribe to Oneindia Telugu

న్యూయార్క్: ట్రంప్ టవర్ కు సంబంధించిన కీలక సమాచారం నిక్షిప్తమై ఉన్న ల్యాప్ టాప్ చోరీకి గురవడం కలకలం రేపింది. గురువారం నాడు బ్రూక్లిన్ లోని బాత్ బీచ్ ప్రాంతంలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ వాహనం నుంచి ఈ ల్యాప్ టాప్ చోరికి గురైంది.

ల్యాప్ టాప్ లో ట్రంప్ టవర్ కు సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ వివరాలతో పాటు, హిల్లరీ క్లింటన్ ప్రవేటు మెయిల్స్ కు సంబంధించిన విచారణ నివేదికలు ఉన్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. వీటితో పాటు దేశభద్రతకు సంబంధించిన వివరాలు సైతం అందులో ఉండటం అమెరికా వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే ఈ సమాచారమంతా ఎన్‌క్రిప్షన్‌ చేసి అధికారులు తెలిపారు.

Laptop containing Trump Tower plans and Clinton email probe stolen from Secret Service agent's car

పోప్ ప్రాన్సిస్ కు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లు సైతం ల్యాప్ టాప్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ల్యాప్ టాప్ ను దొంగిలించిన వ్యక్తి కోసం ముమ్మర గాలింపు జరుపుతున్నారు. ఈ క్రమంలో ల్యాప్ టాప్ తో పాటు అపహరణకు గురైన బ్యాగ్, ఇతర వస్తువులను రికవరీ చేశామని, ల్యాప్ టాప్ ఆచూకీ మాత్రం ఇంతవరకు లభ్యం కాలేదని పోలీసులు అన్నారు. అయితే ఇది మామూలు దొంగల పనా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ల్యాప్ టాప్ దొంగిలించారా? అన్నది తేలాల్సి ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A brazen thief in New York City stole a Secret Service agent's laptop computer that reportedly contained Trump Tower's floor plans, information about the Hillary Clinton email probe and national security information.
Please Wait while comments are loading...