Union Budget 2025:కేటాయింపులు - ఆదాయం, అప్పులు..!!
Union Budget 2025: కేంద్ర ఆర్దిక మంత్రి 2025- 26 వార్షిక బడ్జెట్ ను ప్రతిపాదించారు. ఈ బడ్జెట్ లో కీలక శాఖలకు గతం కంటే కేటాయింపులు పెరిగాయి. మొత్తం రూ. 50,65,345 కోట్లతో బడ్జెట్ ను ప్రతిపాదించారు. రూ.12 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి పూర్తిగా పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక, విద్యా - మౌలిక వసతులు, ఇన్ ఫ్రా రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఎన్నికలు జరగనున్న బీహార్ రాష్ట్రానికి అధికంగా వరాలు ప్రకటించారు. బడ్జెట్ లో ఆదాయ - అప్పుల లెక్కలను వెల్లడించారు.
కేటాయింపులు
బడ్జెట్ లో ప్రధాన రంగాలకు కీలక కేటాయింపులు చేసారు. రక్షణ రూ. 4,91,732 కోట్లు, గ్రామీణా భివృద్ది రూ. 2,66,817 కోట్లు, హోం రూ. 2,33,211 కోట్లు, వ్యవసాయ, అనుబంధ రంగానికి రూ. 1,71,437 కోట్లు, విద్య రూ. 1,28,650 కోట్లు, ఆరోగ్య రూ. 98,311 కోట్లు, పట్టణాభివృద్ది రూ. 96,777 కోట్లు, ఐటి, టెలికం రూ. 95,298 కోట్లు, విద్యుత్ రూ. 81,174 కోట్లు, వాణిజ్య - పరిశ్రమలు రూ. 65,553 కోట్లు, సామాజిక సంక్షేమం రూ. 60,052కోట్లు, వైజ్ఞానికి విభాగాలకు రూ. 55,679 కోట్లు నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు.

ఆదాయం ఇలా
ఇక, ఆదాయపన్ను నుంచి 22 శాతం నుంచి ఆదాయం వస్తుందని ఆర్దిక మంత్రి తన బడ్జెట్ లో ఆశాభావం వ్యక్తం చేసారు. అదే విధంగా కేంద్ర ఎక్సైజ్ నుంచి 5 శాతం వస్తుందని.. జీఎస్టి, ఇతర పన్నుల నుంచి 18 శాతం వస్తుందని అంచనాగా వెల్లడించారు. కార్పొరేషన్ పన్ను ద్వారా 17 శాతం వస్తుందని పేర్కొన్నారు. కస్టమ్స్ ద్వారా... 4 శాతం, అప్పులతో కాని క్యాపిటల్ రిసిప్ట్స్ ద్వారా 1 శాతం అంచనా వేయగా.. పన్నేతర ఆదాయం 9 శాతం..వీటితో పాటుగా అప్పులు, ఇతర మార్గాల ద్వారా 24 శాతం ఆదాయం సమకూరుతుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
ఖర్చుల లెక్క
2025-26 కాలానికి కేంద్ర ఖర్చులను బడ్జెట్ లో వెల్లడించారు. వడ్డీ చెల్లింపులకు 20 శాతం మేర ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు 16 శాతం ఖర్చు గా ప్రతిపాదించారు. అదే విధంగా కీలక సబ్సిడీలకు 6 శాతం, రక్షణ రంగానికి 8 శాతం, రాష్ట్రాలకు పన్నులు, డ్యూటీల ద్వారా చెల్లింపుల్లో 22 శాతం ఖర్చుగా పేర్కొన్నారు. ఫైనాన్స్ కమిషన్, ఇతర బదిలీల ద్వారా 8 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుందని.. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు 8 శాతం, ఇతర ఖర్చులకు 8 శాతం, పెన్షన్స్‌లకు 4 శాతం మేర ఖర్చు చేస్తున్నట్లు నిర్మలా సీతా రామన్ తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేసారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications