21 రోజుల లాక్‌డౌన్ చివరిరోజు..ప్రధాని ఏం చెబుతారు?: మరి కాస్సేపట్లో వీడనున్న ఉత్కంఠత

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడాన్ని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్‌డౌన్ చివరిరోజుకు చేరుకుంది. యావత్ భారతదేశ ప్రజల స్వీయ గృహనిర్బంధం మంగళవారం నాటితో ముగియబోతోంది. ప్రజలు నిర్బంధంలో ఉన్నప్పటికీ.. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గలేదు. ఫలితంగా- ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించుకున్నాయి..తెలంగాణ సహా.

ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఈ ఉదయం 10 గంటలకు ఆయన దేశ ప్రజల ముందుకు రానున్నారు. లాక్‌డౌన్‌పై ప్రధాని ఏం చెబుతారు? ఎలాంటి సందేశాన్ని ఇస్తారనే ఉత్కంఠతకు మరి కాస్సేపట్లో తెర పడబోతోంది. లాక్‌డౌన్ కొనసాగించడంపై ఈ నెల 11వ తేదీన ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. వారి అభిప్రాయాలను తీసుకున్నారు.

Last day of Lockdown: Prime Minister Narendra Modi to address to the nation at 10 AM today

లాక్‌డౌన్ పొడిగింపుపై ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో భిన్న స్వరాలు వినిపించిన విషయం తెలిసిందే. కొన్ని రాష్ట్రాలు పొడిగింపు వైపు మొగ్గు చూపగా.. మరి కొన్ని పాక్షికంగా సడళించడాన్ని ఆశించాయి. రెడ్‌జోన్లు, హాట్‌స్పాట్లకు మాత్రమే పరిమతం చేసేలా లాక్‌డౌన్‌ను పొడిగించాలనే అభిప్రాయాన్ని వెల్లడించాయి. ఈ భేటీ తరువాత ప్రధాని నిర్ణయంలో మార్పు వచ్చిందని తెలుస్తోంది. అందుకే- స్మార్ట్ లాక్‌డౌన్ విధానాన్ని తెర మీదికి తీసుకుని రావచ్చని చెబుతున్నారు.

కరోనా వైరస్ లేని ప్రాంతాల్లో పాక్షికంగా లాక్‌డౌన్‌ను సడలించడం వల్ల కొంతవరకైనా వ్యాపార కార్యకలాపాలు పునఃప్రారంభమౌతాయని, పరిశ్రమలను పునరుద్ధరించడానికి వీలు ఉంటుందని అంటున్నారు. ఫలితంగా- ఆర్థిక వెసలుబాటు ఉండే అవకాశం లేకపోలేదని, దీన్ని దృష్టిలో ఉంచుకునే దేశాన్ని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించిన ప్రతిపాదనలను తీసుకొచ్చారనే చర్చ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+