'పనామా పేపర్స్'లో ఐపీఎల్: లిస్ట్‌లో సైఫ్, కరీనా కపూర్
ముంబై: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'పనామా పేపర్స్' తాజాగా మరికొంతమంది పేర్లను బయటపెట్టింది. పనామా పేపర్స్ వన్, టూ, త్రీ, ఫోర్.. ఇలా వరుసగా పలువురు ప్రముఖుల జాబితాను వెల్లడిస్తున్నారు. తాజా జాబితాలో మరికొందరు బాలీవుడ్ ప్రముఖులు పేర్లు వచ్చాయి.
ఈ జాబితాలో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, కరిష్మా కపూర్‌లతో పాటు పుణేలో రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా ఉన్న చోరిడా కుటుంబం ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త వేణుగోపాల దూత్ ఉన్నారు. పనామా పేపర్లలో తమ పేర్లు రావడంపై సైఫ్, కరీనా కపూర్ స్పందించలేదు.

2010లో ఐపీఎల్లో పుణే ఫ్రాంచైజీని సొంతం చేసుకునేందుకు వీడియోకాన్, పంచశీల గ్రూప్‌తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు సైఫ్, కరీనా, కరిష్మాలు జతకట్టిన సమయంలో వీరితో పాటు బీవీఐ (బ్రిటిషన్ వర్జిన్ ఐలాండ్స్)లో రిజిస్టరైన కంపెనీ ఓడ్బురేట్ లిమిటెడ్ కూడా భాగమైంది.
మొత్తం పదిమంది కలిసి పీ విజన్ స్పోర్ట్స్ ప్రయివేటు లిమిటెడ్ పేరిట ఓ కన్సార్టియంను ఏర్పాటు చేసి పుణే ఫ్రాంచైజీ కోసం బిడ్ వేయగా, ఈ సంస్థ విఫలమైంది. తాజాగా, మొసాక్ ఫోన్సెకా నుంచి బహిర్గతమైన పత్రాల్లో పీ-విజన్, ఓడ్బురేట్ పేర్లు ఉన్నాయి.












Click it and Unblock the Notifications