గాలి పెళ్లి ఖర్చులపై ఐటీకి ఫిర్యాదు: కేసు !
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తన నల్లధనం మొత్తం ఖర్చు పెట్టి ఆయన కుమార్తె పెళ్లి చేస్తున్నారని ఆరోపిస్తూ ఆదాయ పన్ను శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆయన ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు అని ఆరా తీయ్యాలని ఫిర్యాదు చేశారు.
సామాజిక కార్యకర్త టి. నరసింహ మూర్తి అనే ఆయన గాలి జనార్దన్ రెడ్డి మీద ఆదాయ పన్ను శాఖ డైరెక్టర్ జనరల్ కు ఫిర్యాదు చేశారు. ఇంత డబ్బు గాలి జనార్దన్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చింది ? అని ఆరా తీసి తనకు సమాచారం ఇవ్వాలని నరసింహ మూర్తి అధికారులకు మనవి చేశారు.

అనంతరం నరసింహ మూర్తి విలేకరులతో మాట్లాడుతూ ఆడకూతురు పెళ్లి అడ్డుకోవడం నా ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. అయితే ప్రజల సోమ్మును అక్రమంగా దోచుకుని ఇలా వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గాలి తన కుమార్తె పెళ్లి చెయ్యడం మంచిది కాదని అన్నారు.
40 నెలలకు పైగా జైల్లో ఉండి జామీనుపై బయటకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ? ఎవరు ఇచ్చారు ? ఆదాయ పన్ను చెల్లించారా ? అని ఆయన ప్రశ్నించారు. గాలి జనార్దన్ రెడ్డి మీద చేసిన ఫిర్యాదులకు అధికారులు సానుకూలంగా స్పందించారని, పూర్తి వివరాలు ఇస్తామని వారు భరోసా ఇచ్చారని నరసింహ మూర్తి మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications