Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దేశం నలుచెరుగులా తీవ్ర ఉద్రిక్తతే- ఆ చట్టమే శ్రీరామరక్ష

న్యూఢిల్లీ: దేశద్రోహ చట్టాన్ని రద్దు చేస్తారనే వార్తలు కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ చట్టాన్ని పూర్తిగా ఎత్తేయాలని, వలసరాజ్యాలప్పటి చట్టాన్ని పూర్తిగా పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందనే డిమాండ్ ఊపందుకుంటోన్న వేళ- న్యాయ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ రీతూరాజ్ అవస్థి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ చట్టం అమల్లో ఉండటం అత్యవసరమని పేర్కొన్నారు.

దేశంలో ఇప్పుడు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశద్రోహ చట్టాన్ని ఖచ్చితంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని జస్టిస్ రీతూరాజ్ అవస్థి చెప్పారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, పంజాబ్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ చట్టం మాత్రమే దేశానికి సంపూర్ణ భద్రతను కల్పిస్తుందని అన్నారు.

Law Commission

దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి దేశద్రోహ చట్టాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గత ఏడాది మేలో జారీ చేసిన సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ఈ చట్టాన్ని కొనసాగించాలనే ప్యానెల్ సిఫారసులను తాము ఇదివరకే సమర్థించామని గుర్తు చేశారు. ఈ చట్టం దుర్వినియోగం కాకుండా నిరోధించడానికి తగినన్ని చర్యలను తీసుకోవాలని ప్రతిపాదించినట్లు వివరించారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ, జాతీయ భద్రత చట్టం వంటివి వేర్వేరు రంగాల్లో ఉద్దేశించినవని, వాటిని దేశద్రోహ, సంఘ విద్రోహ కార్యక్రమాలను నివారించడానికి ఉపయోగించలేమని రీతురాజ్ అవస్థి అన్నారు. దేశద్రోహం కఠిన చర్యలను తీసుకోవడానికి నిర్దుష్ట చట్టం ఉండాలని తేల్చి చెప్పారు. దేశద్రోహ చట్టం వలసరాజ్యాల వారసత్వంగా ఉండటం దాని రద్దుకు సరైన కారణం కాదని స్పష్టం చేశారు.

Justice Ritu Raj Avasti

అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా,జర్మనీతో సహా అనేక దేశాలు తమ సొంత చట్టాలను కలిగి ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. గత నెలలో ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేశామని అన్నారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 124ఏ దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దేశద్రోహ చట్టం ప్రస్తుతం సంపూర్ణ భద్రతను కల్పిస్తోందని వ్యాఖ్యానించారు.

న్యాయ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి చేసిన సిఫారసుల గురించి ఆయన వివరించారు. విధానపరమైన భద్రతల గురించి ప్రస్తావించామని చెప్పారు. దేశద్రోహం కేసులో ఇన్‌స్పెక్టర్ లేదా అంతకంటే ఎక్కువ స్థాయి పోలీసు అధికారి ప్రాథమిక విచారిస్తారని, ఘటన జరిగిన నాటి నుంచి ఏడు రోజుల్లోగా దర్యాప్తును పూర్తి చేయాల్సి ఉంటుందని సిఫారసు చేసినట్లు వివరించారు.

Law Commission

దేశద్రోహానికి సంబంధినటువంటి ఏదైనా నేరం జరిగినప్పుడు అనుసరించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేయవచ్చని కూడా తాము సిఫారసు చేశామని, ఏ పరిస్థితులలో ఆ నేరానికి పాల్పడ్డాయనే విషయాన్ని కూడా ఈ మార్గదర్శకాలు నిర్ధారించగలవని పేర్కొన్నారు. శిక్షను పెంచడానికి ఉద్దేశించిన ఎలాంటి సిఫారసులను తాము చేయలేదని జస్టిస్ అవస్థి అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+