Big Breaking : జమిలి ఎన్నికలపై లా కమిషన్ భారీ షాక్-2024లో కష్టమే- కారణమిదే..!
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై తీవ్ర స్ధాయిలో చర్చలు జరుగుతున్న వేళ దీనిపై అధ్యయనం కోసం గతంలో నియమించిన 22వ లా కమిషన్ ఇవాళ తన రిపోర్టును సిద్దం చేసింది. ఇందులో జమిలి ఎన్నికలతో పాటు పోస్కో చట్టం వంటి అంశాలపైనా తమ అభిప్రాయాలు పొందుపరిచింది. ఇందులో ఇప్పట్లో జమిలి ఎన్నికలు సాధ్యం కావని తేల్చిచెప్పేసింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు జమిలి ఎన్నికలపై తమ అభిప్రాయాలు చెప్పేందుకు సిద్ధమవుతోంది.
2024లో జమిలి ఎన్నికలు జరగవని లా కమిషన్ వర్గాలు ఇవాళ వెల్లడించాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' విధానాన్ని అమలు చేయడం సాధ్యం కాదని లా కమిషన్ విశ్వసిస్తోందని తెలిపాయి. జమిలి ఎన్నికలపై లా కమిషన్ నివేదికను 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే వెల్లడించాలని భావిస్తున్నారు. లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్తీ దీనిపై మాట్లాడుతూ.. ఇంకా ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్నందున నివేదికకు కొంత సమయం పడుతుందని అన్నారు.

దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని, ఇవి ఇప్పటికిప్పుడు సాధ్యం కావని లా కమిషన్ తన నివేదికలో కేంద్రానికి తెలిపింది. అంతవరకూ విడిగానే లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టాలని సూచించింది. డిసెంబర్ 2022లో దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనపై జాతీయ రాజకీయ పార్టీలు, భారత ఎన్నికల సంఘం, బ్యూరోక్రాట్లు, విద్యావేత్తలు, నిపుణులతో సహా భాగస్వాముల అభిప్రాయాన్ని కోరుతూ 22వ లా కమిషన్ ఆరు ప్రశ్నలు రూపొందించింది. ఈ నివేదికను 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రచురించి, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సమర్పించాలని భావిస్తున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications