లా విద్యార్థి కేసు : స్వామి చిన్మయానంద సంవత్సర కాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు...
ఉత్తర ప్రదేశ్ షాజహన్‌పూర్‌లోని తన ఇంటి నుంచి వారం రోజుల పాటు తప్పిపోయిన లా విద్యార్ధిని బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ పై అత్యాచారం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే... కేసుపై సిట్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలోనే మరోసారి ఆమే చిన్మయానంద్ తనపై ఒక సంవత్సరం పాటు అత్యాచారం చేస్తూ.. దోపిడీకి పాల్పడ్డాడని ఆమే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోంది. దీంతో డిల్లీ పోలీసులు స్వామి చిన్మయానందపై కేసు నమోదు చేశారు. కాగా అత్యాచారం కేసుకు సంబంధించి యూపీ పోలీసులు నిరాకరించడంతో ఆమే డిల్లీలో పిర్యాధు చేశారు. అనంతరం యూపీలోని షాజహాన్ పూర్ పోలీసులకు కేసును బదిలీ చేశారు.

స్వామి చిన్మయానందపై లైంగిక వేధింపుల ఆరోపణలు
ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్‌పూర్‌కు చెందిన ఈ లా విద్యార్థిని బిజెపి నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానందపై లైంగిక వేధింపులు చేసిన విషయం తెలిసిందే. తన ఫేస్‌బుక్‌లో ఆరోపణలు చేసిన తర్వాత ఆమే వారం రోజుల పాటు కనిపించకుండా పోయారు. దీంతో ఆమెను చిన్మయానందే కిడ్నాప్ చేయించారని ప్రచారం జరిగింది. కాగా, సంత్ సమాజ్‌కు చెందిన ఓ పెద్దాయన చాలా మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడని, తనను కూడా హత్య చేయడానికి ప్రయత్నించారని న్యాయ విద్యార్ధిని ఆరోపించింది. అంతేగాక, తనను కాపాడాలంటూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోడీని ఆ వీడియోలో కోరింది. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

న్యాయ విద్యార్ధినిపై కేసు నమోదు
దీంతో చిన్మయానందపై కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆయన ఆశ్రమంలో సోదాలు నిర్వహించారు. అక్కడ ఆ యువతి లభించకపోవడంతో ఆమె కోసం గాలింపు చేపట్టారు. చివరకు ఆమెను రాజస్థాన్ రాష్ట్రంలో గుర్తించారు. యువతి క్షేమంగా ఉందని పోలీసులు చెప్పడంతో ఆమెను తమ ముందు హాజరు పర్చాలంటూ సుప్రీంకోర్టు పోలీసులను ఆదేశించింది. రాజస్థాన్ నుంచి పోలీసులు ఆ యువతిని షాజహాన్‌పూర్ తీసుకొచ్చిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. ఇది ఇలావుంటే, ఆ యువతి తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని చిన్మయానంద ఆరోపించారు. రూ. 5కోట్లు డిమాండ్ చేస్తోందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ యువతిపై కూడ ఎఫ్ఐఆర్ నమోదైంది.

సిట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించిన సుప్రిం కోర్టు
వేధింపుల అంశాన్ని కొంతమంది అడ్వకేట్స్ సుప్రిం కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో సుమోటగా స్వికరించింది. విచారణ అనంతరం కేసుకు సంబంధించి ప్రత్యేక ఇన్విస్టిగేషన్ టీంను (సిట్ ) ను ఐజి ర్యాంకు అధికారితో ఏర్పాటు చేయాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కొద్ది రోజుల క్రితం సుప్రిం కోర్టు ఆదేశించింది. దీంతోపాటు కేసును విచారించేందుకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని అలహాబాద్ హైకోర్టును సైతం అదేశించింది. కాగా రెండు రోజుల క్రితం సిట్ పోలీసులు సుమారు 11 గంటలపాటు ఆమేను విచారించినట్టు ఆమే తెలిపింది.సిట్ పోలీసులకు కూడ అత్యాచారానికి సంబంధించిన అంశాలను వివరించానని ఆమే తెలిపింది. అయితే చిన్మయా నందపై అత్యచారం కేసు మాత్రం నమోదు చేయలేదని ఆమే మీడియాతో తెలిపింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications