కోర్టు ఆవరణలో న్యాయవాది దారుణ హత్య
న్యూఢిల్లీ: ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు సమీపంలో ఓ న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. తలపై బండరాయితో తీవ్రంగా కొట్టి చంపినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గురువారం రాత్రి ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 10గంటల ప్రాంతంలో ఓ చిరువ్యాపారి.. రక్తపు మడుగులో ఉన్న రాజీవ్ శర్మ మృతదేహాన్ని గుర్తించాడు. విషయం తెలుసుకున్న ఇతర లాయర్లు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.

మృతుడు న్యాయవాది రాజీవ్ శర్మగా పోలీసులు గుర్తించారు. మృతుడి ప్రత్యర్థులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, న్యాయవాది హత్యకు నిరసనగా న్యాయవాదుల కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం విధులను బహిష్కరించినట్లు ఢిల్లీ బార్ అసోసియేషన్ సభ్యుడు డిడి శర్మ తెలిపారు.












Click it and Unblock the Notifications