Leader: రివాల్వర్ పట్టుకునేలోపు రెండు చేతులు నరికేశారు, రైల్వేస్టేషన్ ముందే లీడర్ ఫినిష్, భార్య !

బెంగళూరు/ కలబురిగి: రాజకీయాల్లో చురుకుగా ఉంటున్న వ్యక్తి గతంలో నగరసభ అధ్యక్షుడు (మునిసిపల్ చైర్మన్)గా పని చేశాడు. ప్రస్తుతం అతని భార్య నగర సభ అధ్యక్షురాలిగా అధికారంలో ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం పొలిటికల్ లీడర్ సోదరుడిని అతిదారుణంగా హత్య చెయ్యడంతో అ రాజకీయ నాయకుడు ఇద్దరు గన్ మెన్ లను పెట్టుకున్నాడు. తనకు ప్రాణహాని ఉందని ప్రభుత్వం నుంచి అధికారికంగా రివాల్వర్ తీసుకున్నాడు. రైల్వేస్టేషన్ రిజర్వేషన్ కౌంటర్ లోకి వెళ్లి బయటకు వచ్చిన ఆ రాజకీయ నాయకుడిని ప్రత్యర్థులు చుట్టుముట్టారు. నడుంలో ఉన్న రివాల్వర్ బయటకు తియ్యకుండా మొదట అతని చేతులు నరికేశారు. 12 మంది చుట్టుముట్టి రైల్వేస్టేషన్ ఎంట్రన్స్ లోనే పొటిలికల్ లీడర్ ను దారుణంగా నరికి చంపేశారు. వేటకొడవలి కడుపులోనే చిక్కుకుపోయింది. అయినా పొలిటికల్ లీడర్ ను వదలకుండా అతిదారుణంగా నరికి చంపేశారు. నగరసభ అధ్యక్షురాలి భర్తను పట్టపగలు అతి దారుణంగా నరికి చంపడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 పొలిటికల్ లీడర్

పొలిటికల్ లీడర్

కర్ణాటకలోని కలబురిగి జిల్లాలోని శహబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ లీడర్ గిరీష్ కంబనూర అలియాస్ గిరీష్ (42) నివాసం ఉంటున్నారు. కర్ణాటక మాజీ మంత్రి సి. గురునాథ్ కు గిరీష్ సమీప బంధువు. గిరీష్ శహబాద్ పట్టణ నగర సభ అధ్యక్షుడు (మునిసిపల్ చైర్మన్)గా పని చేశారు. నగర సభ అధ్యక్షుడిగా పని చేసే సమయంలో గిరీష్ కు ప్రత్యర్థులు ఎక్కువ అయ్యారు.

 భార్య నగరసభ అధ్యక్షురాలు

భార్య నగరసభ అధ్యక్షురాలు

ప్రస్తుతం గిరీష్ భార్య అంజలి శహబాద్ నగర సభ అధ్యక్షురాలిగా అధికారంలో ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం గిరీష్ సోదరుడు సతీష్ ను ఇదే శహనాబాద్ లో అతికిరాతకంగా నరికి చంపేశారు. అన్న సతీష్ ను దారుణంగా హత్య చెయ్యడంతో గిరీష్ ఇద్దరు ప్రైవేట్ గన్ మెన్ లను పెట్టుకున్నాడు. తనకు ప్రాణహాని ఉందని ప్రభుత్వం నుంచి అధికారికంగా రివాల్వర్ తీసుకున్న గిరీష్ ఇద్దరు గన్ మెన్ లను వెనక్కి పంపించేశాడు.

 రివాల్వర్ మీద చెయ్యివేసే లోపు రెండు చేతులు నరికేశారు

రివాల్వర్ మీద చెయ్యివేసే లోపు రెండు చేతులు నరికేశారు

సోమవారం గిరీష్ అతని స్నేహితుడు శహబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లారు. బెంగళూరు వెళ్లడానికి రైలు టికెట్లు రిజర్వేషన్ చేసిన గిరీష్ రైల్వేస్టేషన్ నుంచి బయటు వచ్చాడు. రైల్వేస్టేషన్ రిజర్వేషన్ కౌంటర్ లోకి వెళ్లి బయటకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గిరీష్ ను అతని ప్రత్యర్థులు చుట్టుముట్టారు. నడుంలో ఉన్న రివాల్వర్ బయటకు తియ్యకుండా మొదట గిరీష్ రెండు చేతుల మీద నరికేశారు.

 రైల్వేస్టేషన్ ముందే నరికేరు

రైల్వేస్టేషన్ ముందే నరికేరు

12 మంది చుట్టుముట్టి రైల్వేస్టేషన్ ఎంట్రన్స్ లోనే పొటిలికల్ లీడర్ గిరీష్ ను దారుణంగా నరికేశారు. వేటకొడవలి గిరీష్ కడుపులోనే చిక్కుకుపోయింది. అయినా పొలిటికల్ లీడర్ గిరీష్ ను వదలకుండా అతిదారుణంగా నరికేశారు. వెంటనే గిరీష్ ను శహబాద్ లోని ఆసుపత్రికి తరలిలించారు.

 ప్రతికార హత్య ?

ప్రతికార హత్య ?

అయితే అప్పటికే గిరీష్ ప్రాణాలు పోయాయని వైద్యులు చెప్పారు. శహబాద్ నగరసభ అధ్యక్షురాలు అంజలి భర్త గిరీష్ ను పట్టపగలు అతి దారుణంగా నరికి చంపడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైల్వేస్టేషన్ ముందే రెండు పెద్ద కత్తులు, మూడు వేటకొడవళ్లు వదిలేసి వెళ్లిపోయారు. పాతకక్షలు, ప్రతికారంతోనే గిరీష్ ను పట్టపగలు పక్కాప్లాన్ తో నరికి చంపేశారని జిల్లా అడిషనల్ ఎస్పీ ప్రసన్న దేశాయ్ అనుమానం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+