వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లి చిక్కు: నిన్న చిరు, నేడు పవన్, టిడిపిలో గుబులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త పార్టీ పెడతారనే వార్తల నేపథ్యంలో పార్టీలకతీతంగా ఆయనపై నేతలు స్పందిస్తున్నారు. కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు ఏకంగా పవన్ మూడు పెళ్లిళ్ల పైనే ప్రశ్నలు గుప్పించారు. పవన్ మూడు పెళ్లిళ్ల పైన మహిళలు ప్రశ్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ రాజకీయ ఆరంగేట్రంపై ఆయా పార్టీల నేతలు ఆచితూచి స్పందిస్తున్నాయి.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఏం చేశారని, ఇక పవన్ కల్యాణ్ ఏం చేస్తారని అంటున్నారు. అదే సమయంలో పవన్ లోక కల్యాణం కోసం పార్టీ పెడితే స్వాగతిస్తామని చెబుతున్నారు. ముఖ్యంగా బిజెపి, టిడిపిలు ఆచితూచి స్పందిస్తున్నాయి. టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... తెలుగు జాతి కోసం తమకు సహకరించాలని పవన్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి చెప్పారు.

Leaders personal attack

బిజెపి నేత వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... చిరంజీవి ప్రజారాజ్యం ఏమయిందో ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. అయితే, లోక కల్యాణం కోసం పవన్ పార్టీ పెడితే స్వాగతిస్తామన్నారు. పవన్ పార్టీ పైన ఆయా పార్టీల నేతలు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కాంగ్రెసు పార్టీ నేత అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు అంతగా స్పందించడం లేదు. ఒక్క విహెచ్ మాత్రం ఘాటుగా స్పందించారు. మూడు పెళ్లిళ్లపై చెప్పాలని ప్రశ్నించారు. 2008లో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన కూతురు పెళ్లి విషయమై ఇతర పార్టీల నేతలు ప్రశ్నించారు. ఇప్పుడు పవన్ పార్టీ నేపథ్యంలో ఆయన మూడు పెళ్లిళ్ల గురించి ప్రశ్నిస్తున్నారు.

టిడిపి గుబులు!

పవన్ కల్యాణ్ పార్టీ పైన టిడిపిలో గుబులు ఉందని చెబుతున్నారు. రాష్ట్ర విభజన, సీమాంధ్ర నిర్మాణం నేపథ్యంలో యువత టిడిపి వైపు చూస్తున్నారంటున్నారు. ఇదే సమయంలో పవన్ పార్టీ పెడితే తమకు ఇబ్బంది ఎదురవుతుందనే ఆందోళనలో ఉన్నారంటున్నారు. పవన్‌కు యూత్‌లో చాలా ఇమేజ్ ఉంది. ఇదే భయం టిడిపిని పట్టుకుందంటున్నారు.

మరోవైపు కాపులు ఇప్పుడిప్పుడే టిడిపి వైపు మరలుతున్నారని, పవన్ పార్టీ పెడితే వారు అటు వైపు మరలే ఛాన్సుందని ఆవేదన చెందుతున్నారట. గత అనుభవం టిడిపిని వణికిస్తోందని అంటున్నారు. 2009లో ప్రజారాజ్యం, లోక్ సత్తా పార్టీలు లేకుంటే టిడిపి అధికారంలోకి వచ్చి ఉండేదనే వాదన ఉంది. కిరణ్ పార్టీ పైన పెద్దగా ఆందోళన చెందనప్పటికీ, పవన్ పార్టీ పైన ఆందోళన చెందుతున్నారట.

English summary
Congress leader Digvijay Singh on Tuesday hit out at Narendra Modi, saying that the Bharatiya Janata Party's prime ministerial candidate has little sense of Geography and General Knowledge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X