1962 యుద్ధం గుర్తుందిగా: చైనా వివాదాస్పద వ్యాఖ్యలు.. తీవ్రంగా హెచ్చరించిన భారత్

చైనా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ‘1962 యుద్ధం గుర్తుందిగా.. ఇండియ‌న్ ఆర్మీ చ‌రిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి..’అంది.

న్యూఢిల్లీ: ఇండియాను తొలిసారి చైనా తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించింది. సిక్కిం స‌రిహద్దులో భార‌త బ‌ల‌గాలు చైనా భూభాగంలోకి అడుగుపెట్ట‌డంపై ఆ దేశం మండిపడుతోంది. '1962 యుద్ధం గుర్తుందిగా.. ఇండియ‌న్ ఆర్మీ చ‌రిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి.. అని చైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

చదవండి: 1962ను గుర్తు చేశారుగా, కానీ: చైనాకు జైట్లీ దిమ్మతిరిగే జవాబు

ఇండియా, భూటాన్‌, చైనా స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన డోక్లామ్‌, డోకాలా మధ్య రోడ్డు నిర్మాణాన్ని చేప‌ట్టింది చైనా. అయితే భార‌త బ‌ల‌గాలు త‌మ భూభాగంలోకి వ‌చ్చి.. రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్నాయ‌ని చైనా ఆరోపించింది.

భారత్ పై చైనా గుర్రు...

భారత్ పై చైనా గుర్రు...

చైనీస్ మిలిట‌రీ, ఆ దేశ విదేశాంగ శాఖ.. రెండూ ఈ విష‌యంలో భార‌త్‌పై గుర్రుగా ఉన్నాయి. భారత బ‌ల‌గాల‌ను వెంట‌నే వెన‌క్కి పిల‌వాల‌ని కూడా స్ప‌ష్టం చేశాయి. ఈ స‌మ‌స్య‌కు చ‌ర్చ‌ల‌తో ప‌రిష్కారం క‌నుగొందామ‌ని చైనా విదేశాంగ శాఖ చెప్పింది.

ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై మండిపాటు...

ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై మండిపాటు...

అంత‌ర్గత భ‌ద్ర‌త‌తోపాటు చైనా, పాకిస్తాన్‌ల‌తో యుద్ధానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామ‌ంటూ ఇటీవల ఇండియ‌న్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావ‌త్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కూడా చైనా మండిప‌డింది.

యుద్ధానికి కాలుదువ్వే ముందు...

యుద్ధానికి కాలుదువ్వే ముందు...

చైనీస్ ఆర్మీ అధికార ప్ర‌తినిధి లూ కాంగ్ మాట్లాడుతూ ఇవి చాలా బాధ్య‌తా రహిత్య‌మైన వ్యాఖ్య‌ల‌ని స్ప‌ష్టంచేశారు. ఆ వ్య‌క్తి గ‌త అనుభ‌వాల నుంచి పాఠాలు నేర్చుకొని.. యుద్ధానికి కాలుదువ్వే ముందు గతాన్ని గుర్తు చేసుకోవాలంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు.

డోక్లాంలోకి చొరబాటు...

డోక్లాంలోకి చొరబాటు...

ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో చైనా మరోమారు రెచ్చిపోయింది. మరోసారి చొరబాటుకు ప్రయత్నిస్తూ, వందలాది మంది సైన్యాన్ని సరిహద్దులు దాటించగా, వారు భారత్ లోని డోక్లాం ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చారు.

కేంద్రం సీరియస్ వార్నింగ్...

కేంద్రం సీరియస్ వార్నింగ్...

దీనిపై తీవ్రంగా స్పందించిన భారత సైన్యం వారిని అడ్డుకుంది. ఆ వెంటనే సమస్య తీవ్రతను తెలుసుకున్న కేంద్రం చైనాకు హెచ్చరికలు జారీ చేసింది. హద్దుల్లో ఉండాలని చైనా రాయబార కార్యాలయానికి నోటీసులు పంపింది.

భారత్ కు భూటాన్ మద్దతు...

భారత్ కు భూటాన్ మద్దతు...

భారత్ కు నమ్మకమైన మిత్ర దేశంగా ఉన్న భూటాన్ కూడా ఈ విషయంలో మద్దతు పలికింది. చైనా అక్రమంగా సరిహద్దులు దాటుతోందని ఆరోపిస్తూ, చైనా సైనికులను అడ్డుకునేందుకు తమ సైన్యాన్ని కూడా రంగంలోకి దింపింది.

వెనక్కి తగ్గిన చైనా...

వెనక్కి తగ్గిన చైనా...

ఇటు భారత్ నుంచి అటు భూటాన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైన నేపథ్యంలో చైనా వెనక్కి తగ్గింది. ప్రస్తుతం చైనా సైనికులు వెనక్కు వెళుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి వుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+