గ్యాంగ్‌రేప్ బాధితురాలికి జైలు శిక్ష విధించిన కోర్టు: బలమైన కారణమే ఉంది!
పాట్నా: తనపై పలువురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేసిన ఓ బాధితురాలికి కోర్టు జైలు శిక్ష విధించింది. అయితే, ఇందుకు ఓ బలమైన కారణంఉంది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రంలోని అరారియా జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువతిపై కొంత మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తనపై జరిగిన దారుణాన్ని పోలీసులకు వివరించి, నిందితులపై కేసు పెట్టింది బాధిత యువతి.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో బాధిత యువతి వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు యువతిని అరారియా మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు పోలీసులు. దీంతో బాధితురాలు తన వాంగ్మూలాన్ని ఇచ్చింది.
అయితే, తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని తనతో వచ్చిన సామాజిక కార్యకర్తకు చూపిన తర్వాత సంతకం పెడతానని మొండికేసింది. అందుకు మేజిస్ట్రేట్ అంగీకరించలేదు. అలా వాంగ్మూలాన్ని చూపించడం చట్ట విరుద్ధమని చెప్పారు. అయినప్పటికీ ఆ యువతి వినకపోవడంతో మేజిస్ట్రేట్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video
కోర్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు, విధులకు ఆటంకం కలిగించినందుకు ఆ బాధిత యువతికి జైలు శిక్ష విధించారు మేజిస్ట్రేట్.
అంతేగాక, ఆమెతోపాటు వచ్చిన ఇద్దరు సామాజిక కార్యకర్తలకు కూడా మేజిస్ట్రేట్ జైలు శిక్ష విధించారు. దీంతో పోలీసులు బాధితురాలతోపాటు వారిద్దర్నీ కూడా జైలుకు తరలించారు.












Click it and Unblock the Notifications