Tamil Nadu Election: ఒక్కో అఫిడవిట్లో ఒకలా- చిక్కుల్లో విజయ్ ? పోటీపై అనర్హత?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగుతున్న టీవీకే అధినేత విజయ్ (Vijay)కు ఎటు చూసినా కష్టాలే. ఓవైపు రాష్ట్రంలో అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకేల మధ్య నెలకున్న ముఖాముఖీ పోరులో తన స్ధానం నిరూపించుకోవాల్సిన పరిస్దతి ఎదురు కావడం, మరోవైపు బీజేపీ కూటమిలో చేరకపోవడంతో తన సినిమా జననాయగన్ ను నిలిపేయడం, కరూర్ తొక్కిసలాట విషయంలో సీబీఐ కేసులు ఎదుర్కోవాల్సి రావడం.. ఇలా పెరిగిపోతున్న కష్టాలకు ఇప్పుడు మరొకటి తోడైంది.

నటుడుగా ఉంటూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన టీవీకే అధినేత విజయ్.. తనపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులకు సంబంధించి తాజాగా దాఖలు చేసిన రెండు ఎన్నికల అఫిడవిట్లలో వ్యత్యాసాలు ఉన్నట్లు తేలడంతో ఇరుకునపడ్డారు. ఇండియా టుడే టీవీ కథనం ప్రకారం.. పెరంబూర్ నుండి విజయ్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో తనపై ఎలాంటి పెండింగ్ కేసులు లేవని పేర్కొన్నారు. అయితే తిరుచిరాపల్లి (తూర్పు) నుండి దాఖలు చేసిన అఫిడవిట్‌లో మాత్రం రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఇదే ఇప్పుడు వివాదంగా మారబోతోంది.

Legal Trouble for TVK s Vijay Poll Affidavits Flagged Over Case Discrepancies

వీటికి తోడు గతేడాది పెరవల్లూరు పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన ఒక కేసును సైతం పెరంబూర్ సీటు నామినేషన్ ఫైలింగ్‌లో విజయ్ వెల్లడించలేదు. ఇలా పొంతనలేని నామినేషన్ అఫిడవిట్లు దాఖలు చేయడంతో ఆయనపై ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది. అయితే విజయ్ కు ప్రస్తుతం ఓ ఛాన్స్ ఉంది. ఈ తేడాలను సవరిస్తూ మరో అఫిడవిట్‌ను సమర్పించడమే ఏకైక పరిష్కార మార్గమని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.

Legal Trouble for TVK s Vijay Poll Affidavits Flagged Over Case Discrepancies

మరోవైపు విజయ్ అఫిడవిట్లో తన మొత్తం ఆస్తుల విలువ రూ.603.20 కోట్లుగా ప్రకటించారు. ఇందులో పలు ఖాతాలలో ఉన్న రూ. 213 కోట్లకు పైగా బ్యాంకు డిపాజిట్లు కూడా ఉన్నాయి. అలాగే ఆస్తుల జాబితాలో బీఎండబ్ల్యూ 530, టయోటా లెక్సస్, టయోటా వెల్‌ఫైర్, బీఎండబ్ల్యూ ఐ7 వంటి విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. ఆయన భార్య సంగీత, తన ప్రత్యేక ఆస్తుల విలువ మొత్తం రూ. 15.76 కోట్లుగా ప్రకటించారు. ఇందులో రూ. 15.51 కోట్ల విలువైన చరాస్తులు మరియు రూ.25 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+