Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు (tamil nadu Assembly election 2026)సమీపిస్తున్న తరుణంలో హీరో, టీవీకే అధినేత విజయ్ (Vijay)రూటుమారుస్తున్నారు. ముఖ్యంగా అధికార డీఎంకే కూటమికి అన్నాడీఎంకే పోటీదారు కాదని, తానే అసలైన పోటీదారు అని చెబుతున్న విజయ్ కు తాజాగా వెలువడుతున్న సర్వేలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఆయన గెలవక తప్పని పోరులో వేగంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఆయన డీఎంకే కంచుకోటపై గురిపెట్టి అన్నాడీఎంకేను వెనక్కి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

డీఎంకే కంచుకోటలో విజయ్ వ్యూహాలు (Vijay)

డీఎంకే కంచుకోటగా పేరున్న చెన్నై నగరంలో ఆ పార్టీతో పోటీ పడేందుకు గతంలో తమ కెరీర్ ఆరంభంలో ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజాలు సైతం ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు డీఎంకే కంచుకోటలోనే దూరి సత్తా చాటుకుంటేనే తనకు భవిష్యత్తు అని నమ్ముతున్న విజయ్ ఆ సాహసం చేస్తున్నారు. అందుకే చెన్నైలోని పెరంబూరు నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన విజయ్.. తిరుచిరాపల్లి (తూర్పు)ను మరో 'సురక్షిత స్థానంగా ఎంచుకున్నారు. దీని వెనుక అసలు వ్యూహం తన పార్టీ టీవీకేను అధికార డీఎంకేకు ప్రత్యామ్నాయంగా మార్చి, అన్నాడీఎంకేను వెనక్కి నెట్టాలని, తద్వారా రాష్ట్రంలో నంబర్ టూ తానేనని చాటుకోవాలనేది విజయ్ వ్యూహంగా కనిపిస్తోంది. ఎందుకంటే తాజా సర్వేల్లో విజయ్ పార్టీ టీవీకే ప్రభావం రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం లేదని తేలిపోయింది. ఇలాంటి పరిస్ధితుల్లో డీఎంకే కంచుకోటల్లో బరిలోకి దిగడం ద్వారా రాష్ట్రంలో తన గ్రాఫ్ పెంచుకోవడంతో పాటు అన్నాడీఎంకేను మూడో స్ధానానికి నెట్టవచ్చని భావిస్తున్నారు.

Vijay s Chennai Gambit How the City is Key to Toppling DMK AIADMK

చెన్నై కేంద్రంగా విజయ్ పోరు

చెన్నై నార్త్ పరిధిలోని పెరంబూరు సీటు నుంచి పోటీ చేయడం, తన ప్రముఖ నాయకులను అక్కడి నుంచే నిలబెట్టడం ద్వారా సీఎం స్టాలిన్‌కు, అధికార డీఎంకేకు తాను ప్రత్యక్ష పోటీదారుడనని విజయ్ స్పష్టం చేస్తున్నారు. పెరంబూరు నియోజకవర్గం, సీఎం స్టాలిన్ మళ్ళీ పోటీచేస్తున్న కోలత్తూర్ నియోజకవర్గానికి సరిహద్దుగా ఉంది. వాస్తవానికి చెన్నై జిల్లా డీఎంకేకు చాలా సంవత్సరాలుగా ఎన్నికల కంచుకోట. ఎమ్‌జీఆర్‌, జయలలిత వంటి బలమైన ప్రత్యర్థులు సైతం చెన్నైలో డీఎంకేను పూర్తిగా బలహీనపరచలేకపోయారు. ఎమ్‌జీఆర్‌ తమిళనాడులో మూడు వరుస ఎన్నికల్లో విజయం సాధించినా, 1977 వేవ్ ఎన్నిక మినహా చెన్నైలో డీఎంకే ఆధిపత్యాన్ని అధిగమించలేకపోయారు.

డీఎంకే ఆధిపత్యాన్ని దెబ్బకొట్టేయత్నం

జయలలిత దశాబ్దకాల ప్రయత్నం 2006, 2011 ఎన్నికలలో డీఎంకే కోటను కొంతమేర దెబ్బతీసింది. అయితే ఆమె మరణానంతరం 2016లో డీఎంకే చెన్నైలో తిరిగి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. 2021 అసెంబ్లీ ఎన్నికలలో, డీఎంకే కూటమి జిల్లాలోని మొత్తం 16 స్థానాలనూ గెలుచుకుని క్లీన్‌స్వీప్‌ చేసింది. దీంతో విజయ్ రెండు స్థానాల నుంచి పోటీ చేయాలన్న వ్యూహం రచించారు. రాజకీయ విశ్లేషకుల ప్రకారం విజయ్ కు తిరుచిరాపల్లి 'సురక్షితమైన ఎంపిక' కాగా, పెరంబూరు సీటు సీఎం స్టాలిన్‌కు బలమైన పోటీదారుడిగా ఆయన ప్రతిష్టను మరింత పెంచుతుంది.

Vijay s Chennai Gambit How the City is Key to Toppling DMK AIADMK

డీఎంకే ఉక్కిరిబిక్కిరి ?

చెన్నైపై విజయ్ ఫోకస్ డీఎంకేకు ముప్పుగా పరిణమిస్తోంది. ఎందుకంటే జిల్లాలోని మొత్తం 16 స్థానాలు డీఎంకే చేతిలోనే ఉన్నాయి. టీవీకే సాధించే ప్రతి గెలుపు డీఎంకేకు నష్టమే. అందుకే విజయ్ ఈ వ్యూహాన్ని నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. చెన్నైలో తన పార్టీలోని ప్రముఖులను బరిలోకి దించాలన్న విజయ్ వ్యూహం రాబోయే ఎన్నికలలో డీఎంకే వేగాన్ని అడ్డుకోవచ్చు. విజయ్ పోటీ చేస్తున్న పెరంబూరు సీటు 2019 నుండి డీఎంకే ఎమ్మెల్యే ఆర్.డి.శేఖర్ చేతిలో ఉంది. ఇప్పుడు విజయ్ ఆయన్ను ఎదుర్కోవాల్సి ఉంది. విజయ్ మాత్రమే కాకుండా ఇతర టీవీకే ప్రముఖ అభ్యర్థులు కూడా చెన్నై జిల్లా నుండి పోటీ పడుతున్నారు. టీవీకే ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్ (బస్సీ ఆనంద్) టి. నగర్ నుండి, ఎన్నికల వ్యూహకర్త ఆధవ్ అర్జున విల్లివాక్కం నుండి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ కె. రాజమోహన్ ఎగ్మూర్ నుండి బరిలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+