Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..!

తమిళనాడు(Tamil Nadu)లో ఈసారి అసెంబ్లీ ఎన్నికల పోరు ఉత్కంఠ రేపుతోంది. దీనికి కారణం ఐదేళ్ల పాలన తర్వాత ప్రజాతీర్పు కోరుతున్న డీఎంకే కూటమికి విపక్ష అన్నాడీఎంకే కూటమి, విజయ్ కొత్త పార్టీ టీవీకే నుంచి ఎదురవుతున్న గట్టిపోటీయే. దీంతో పలు సర్వేలు సైతం ఈసారి డీఎంకే కూటమి వెనుకబడిందని, అన్నాడీఎంకే కూటమికి గెలుపు అవకాశాలు ఉన్నాయని తేల్చేశాయి. ఈ నేపథ్యంలో గతంలో పలు విజయవంతమైన సర్వేలు చేసిన లోక్ పోల్ సంస్థ తన సర్వే ఫలితాలు వెల్లడించింది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే కూటములతో పాటు విజయ్ కొత్త పార్టీ టీవీకే మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని భావించినా, అంతిమంగా ముఖాముఖీ పోరే జరగబోతోందని లోక్ పోల్ సర్వే తేల్చేసింది. డీఎంకే-అన్నాడీఎంకే మధ్యే పోటీ నెలకున్నట్లు తన తాజా సర్వేలో వెల్లడించింది. టీవీకే ప్రభావం ఏమాత్రం లేదని కూడా ఇందులో తెలిపింది. రాష్ట్రంలోని 234 సీట్లలో డీఎంకే కూటమి అత్యధికంగా 181-189 సీట్లు సాధించి విజేతగా నిలవబోతోందని సర్వే తేల్చింది.

Tamil Nadu Election Winner Revealed New Lok Poll Survey Breaks Down Triangular Fight

ఈ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమికి 40.1 శాతం ఓట్లు లభిస్తున్నట్లు లోక్ పోల్ సర్వేలో వెల్లడించింది. రెండో స్ధానంలో నిలవబోతున్న అన్నాడీఎంకే కూటమి కేవలం 38-42 సీట్లు మాత్రమే సాధిస్తుందని, 29 శాతం ఓటర్లు మాత్రమే ఆ కూటమిని ఆదరిస్తున్నట్లు లోక్ పోల్ తెలిపింది. అలాగే విజయ్ పార్టీ టీవీకేకు కేవలం 8-10 సీట్లు మాత్రమే లభిస్తాయని అంచనా వేసింది. అయితే 23.9 శాతం ఓట్లు లభిస్తున్నట్లు తేల్చింది. ఈ సర్వే కోసం ప్రతీ నియోజకవర్గం నుంచి 500 శాంపిల్స్ చొప్పున మొత్తం 1.17 లక్షల శాంపిల్స్ తీసుకున్నట్లు లోక్ పోల్ తెలిపింది.

Tamil Nadu Election Winner Revealed New Lok Poll Survey Breaks Down Triangular Fight

అలాగే ఈ ఎన్నికల్లో ప్రజలు సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నట్లు అడిగిన ప్రశ్నకు అత్యధికంగా 41 శాతం మంది ఎంకే స్టాలిన్ పేరే చెప్పారు. తర్వాతి స్ధానంలో 27.1 శాతం ఓట్లతో హీరో విజయ్ కు మద్దతుగా నిలిచారు. 24.1 శాతం ఓట్లతో అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి సీఎం రేసులో మూడో స్ధానంలో నిలిచారు. ఇతరులకు మరో 7.8 శాతం సీఎంగా మద్దతిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+