తమిళనాడు టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరలో.. ఇలా చేయండి..!

తమిళనాడులో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రకృతి రమణీయమైన ప్రాంతాలతోపాటు ఆధ్యాత్మిక ప్రాంతాలకు నెలవుగా తమిళనాడు ఉంది. తమిళనాడులో ప్రాచీనమైన ఆలయాలు చాలానే ఉన్నాయి. అరుణాచలం, రామేశ్వరం, మధురై, తంజావూరు, చిదంబరం లాంటి ప్రధాన క్షేత్రాలను చుట్టేసి రావొచ్చు. భక్తుల కోసం తక్కువ ధరకే ఇండియన్​ రైల్వేస్​ క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​ అద్భుతమైన ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫ్యామిలీతో కలిసి ఈ టూర్ ను ఆస్వాదించవచ్చు.

తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు వీలుగా ఐఆర్సీటీసీ దివ్య దక్షిణ యాత్ర పేరుతో ఓ ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూర్ మొత్తం ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లు ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా అరుణాచలం, రామేశ్వరం, చిదంబరం, మధురై, తంజావూర్ ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. టూర్ లో భాగంగా రైలు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణుగుంట మీదుగా వెళ్తుంది. ఈ స్టేషన్లలో ఎక్కడైనా ప్రయాణికులు రైలు ఎక్కొచ్చు. ఇక ప్రస్తుతం ఈ టూర్​ మే 24వ తేదీన అందుబాటులో ఉంది.

ఐఆర్సీటీసీ టూర్ లో భాగంగా తొలిరోజు సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు భారత్ గౌరవ్ టూరిస్టు రైలు బయల్దేరుతుంది. ఆ రాత్రి ప్రయాణం సాగుతుంది. రెండో రోజు ఉదయం 9 గంటలకు అరుణాచలానికి చేరుకుంటారు. అరుణాచలం ఆలయం దర్శనం చేసుకుంటారు. రాత్రికి రామేశ్వరం బయల్దేరుతారు. రామేశ్వరం దర్శనం అనంతరం మధురైకు వెళ్తారు. మధురై దర్శనం తర్వాత అక్కడినుంచి కన్యాకుమారికి స్టార్ట్ అవుతారు. కన్యాకుమారిలో పర్యాటక ప్రాంతాలను సందర్శించిన తర్వాత తిరుచిరాపల్లికి చేరుకుంటారు. అక్కడే రాత్రి బస ఉంటుంది.

TamilNadu Holy Sites on a Budget Arunachalam Rameswaram Madurai Thanjavur budget pilgrimage

ఇక ఏడోరోజు తిరుచిరాపల్లి నుంచి చిదంబరానికి బయల్దేరుతారు. చిదంబరంలో నటరాజస్వామి దర్శనం అనంతరం అక్కడే సికింద్రాబాద్ కు రైలు రాత్రి 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. మరుసటిరోజు రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఈ టూర్ కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం IRCTC అధికారిక వెబ్ సైట్ ను సందర్శించొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+