బొట్టు, తిలకం ఉంటే నో ఎంట్రీ.. హిజాబ్ అయితే ఓకే.. ఉద్యోగులకు షాకింగ్ రూల్స్ !!
కళ్లజోళ్ల ప్రముఖ రిటైలర్ లెన్స్‌కార్ట్‌లో ఉద్యోగుల డ్రెస్ కోడ్‌కు సంబంధించిన వివాదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కంపెనీ స్టోర్‌లలో హిజాబ్‌కు అనుమతి ఉందని.. అయితే బొట్టు, తిలకం, జంధ్యం వంటి సాంప్రదాయ మతపరమైన చిహ్నాలపై నిషేధం ఉందని సూచించే ఒక పత్రం ప్రచారంలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టీసీఎస్ నాసిక్ కేసు నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
నిజానికి, టీసీఎస్ నాసిక్ ఘటన దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది. హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుని జరిపిన అరాచకాలుగా ఆరోపితమైన ఈ వ్యవహారంపై బీజేపీ, హిందూ సంఘాలు 'కార్పొరేట్ జిహాద్’, 'లవ్ జిహాద్’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేయగా, హెచ్‌ఆర్ విభాగంలో పనిచేసిన నిదా ఖాన్ అనే మహిళ పరారీలో ఉన్నట్లు సమాచారం.

ఈ ఉద్రిక్త పరిణామాల మధ్య, లెన్స్‌కార్ట్ ఉద్యోగుల డ్రెస్ కోడ్‌కు సంబంధించిన ఒక పత్రం ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. ఇది ఉద్యోగులు హిజాబ్ ధరించడానికి అనుమతి ఇస్తూనే, బొట్టు, తిలకం, జంధ్యం ధరించడాన్ని నిషేధిస్తుందని ఆ పత్రంలో ప్రస్తావించారు. అంతేకాకుండా తలపాగా, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు.. అలాగే స్టోర్‌లో బురఖాలు ధరించడం నిషిద్ధమని, మతపరమైన దారాలు లేదా మణికట్టుకు కట్టుకునే పట్టీలను కార్యాలయానికి వచ్చే ముందు తొలగించాలని అందులో పొందుపరిచారు.
హిజాబ్‌కు అనుమతినిస్తూ, భారతీయ సంస్కృతికి ప్రతీకలైన బొట్టు, తిలకాలను నిషేధించడంపై నెటిజన్లు, ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై స్పందించిన లెన్స్‌కార్ట్ వ్యవస్థాపకుడు, సీఈఓ పీయూష్ బన్సల్, వైరల్ అవుతున్న డ్రెస్ కోడ్ పత్రం ప్రస్తుత తమ మార్గదర్శకాలను ప్రతిబింబించడం లేదని అన్నారు. ఆ పత్రం తప్పుగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
తమ సంస్థలో బిందీలు, తిలకాలతో సహా ఎలాంటి మతపరమైన వ్యక్తీకరణలపై ఆంక్షలు లేవని బన్సల్ పేర్కొన్నారు. అలాగే, తమ మార్గదర్శకాలను కంపెనీ క్రమం తప్పకుండా సమీక్షిస్తుందని ఆయన తెలిపారు. "భారతదేశం వ్యాప్తంగా మాకు వేలాది మంది టీమ్ సభ్యులు ఉన్నారు, వారు ప్రతిరోజూ మా స్టోర్లలో తమ మతాన్ని, సంస్కృతిని గర్వంగా ప్రదర్శిస్తారు. వారే లెన్స్‌కార్ట్," అని ఆయన ఉద్ఘాటించారు.
ఈ వివాదంపై ప్రముఖ సోషల్ మీడియా పర్సనాలిటీ షెఫాలీ వైద్య (@ShefVaidya) ఏప్రిల్ 15, 2026న బన్సల్‌ను ట్యాగ్ చేస్తూ, హిజాబ్‌కు అనుమతినిచ్చి, బొట్టు/కలవాకు ఎందుకు కాదని ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ, పీయూష్ బన్సల్ (@peyushbansal) అదే రోజున చేసిన ట్వీట్‌లో, వైరల్ అవుతున్న పత్రం తప్పు అని, తమ పాలసీలో బిందీ మరియు తిలకంతో సహా ఎలాంటి మతపరమైన వ్యక్తీకరణలకు ఎటువంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. దీంతో లెన్స్‌కార్ట్‌పై కొనసాగిన వివాదానికి తెరపడింది.












Click it and Unblock the Notifications