అనుమానంతో భార్య హత్య: జీవిత ఖైదు
చెన్నై: భార్యపై అనుమానం పెంచుకుని ఆమెను పదే పదే వేదిస్తూ చివరికి హత్య చేసిన భర్తకు న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష విధించింది. తమిళనాడులోని ఈరోడ్డు జిల్లా కోర్టు రంగనాథన్ (50) అనే వ్యక్తికి శిక్ష విధించింది.
రంగనాథన్ ఈరోడ్డులో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి భార్య, కుమార్తె ఉన్నారు. ఇతను భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. ఆమె వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని గొడవ పెట్టుకునే వాడు.
ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వెళ్లి సోదా చేసేవాడు. ఈ విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగేది. 2014 జూన్ 25వ తేది ఇంటికి వెళ్లి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఇంటికి ఎవరు వచ్చి వెళ్లారు చెప్పాలని నిలదీశాడు.

ఇద్దరి మద్య మాటామాటా పెరిగింది. సహనం కొల్పోయిన రంగనాథన్ నైలాన్ తాడు తీసుకుని భార్య గొంతు బిగించి హత్య చేశాడు. తన తల్లిని తండ్రే హత్య చేశాడని రంగనాథన్ కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసిన పోలీసులు రంగనాథన్ ను అరెస్టు చేసి విచారణ చేసి కోర్టులో నివేదిక సమర్పించారు. రంగనాథన్ నేరం చేశాడని రుజువు కావడంతో అతనికి జీవిత ఖైదు శిక్ష విధిస్తున్నామని ఈరోడ్ జిల్లా కోర్టు మెజిస్ట్రేట్ ఎన్. తిరునవుక్కరసు ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications