కుక్కర్ బాంబు కేసుకు, కేంద్ర మంత్రి గడ్కరీ బెదిరింపుల కేసుకు లింక్, జైల్లో స్కెచ్ !

మంగళూరు/నాగ్ పూర్: కర్ణాటకలోని బెళగావి జైలులో ఉన్న ఖైదీ అఫ్సర్ ఇప్పుడు కేంద్ర మంత్రి గడ్కరీ కేసులో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జైలులో వారెంట్ మీద వెళ్లిన ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో అనేక సంచలన విషయాలు బయకు వస్తున్నాయని అధికారులు అంటున్నారు. కర్ణాటకలోని మంగళూరులో జరిగిన కుక్కర్ బాంబ్ కేసు లో నిందితుడు షరీఖ్ బెళగావి జైలులో నిందితుడు అఫ్సర్ వద్ద శిక్షణ పొందినట్లు ఎన్ఐఏ అధికారుల విచారణలో తేలింది.

2022 నవంబర్ 19వ తేదీన మంగళూరులో జరిగిన కుక్కర్ బాంబ్ పేలుడు కేసులో ప్రధాన సూత్రధారి, బెళగావి జైలులో ఉన్న లష్కరే ఏ తోయిబా సంస్థ సభ్యుడు అఫ్సర్ పాషా అతని, అతని గురించి మహారాష్ట్రలోని నాగ్ పూర్ పోలీసులు సంచలన విషయాలు సేకరించారు. కర్ణాటకలోని బెళగావి జైల్లో ఉంటూనే కుక్కర్ బాంబు స్కెచ్ కు అఫ్సర్ బాషా మరో నిందితుడు షరీఫ్ కు శిక్షణ ఇచ్చాడని వెలుగు చూసింది.

Nitin Gadkari

కర్ణాటక తీరంలో ఉన్న నగరంలో. 2005లో బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ)పై దాడికి పాల్పడిన నిందితుల్లో ఇతను ఉన్నాడని, 2012లో జమ్మూ కాశ్మీర్‌లో టెర్రర్ రిక్రూట్‌మెంట్ కేసులోను ఇతను దోషి అని, మంగళూరు కుక్కర్‌ బాంబు పేలుడో కేసులో శివమొగ్గకు చెందిన మహ్మద్ షరీఖ్‌కు శిక్షణ ఇచ్చాడని నాగ్ పూర్ పోలీసులు వివరాలు సేకరించారు.

బాంబు తయారీలో బంగ్లాదేశ్‌లో శిక్షణ పొందిన అఫ్సర్ పాషా బ్యాంకు ఖాతాలో ఇప్పుడు దేశంలో నిషేధించబడిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) నాయకుల నుంచి రూ. 5 లక్షలు. డబ్బు బదిలీ అయినట్లు మహారాష్ట్ర పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి సంఘటనలు మరోసారి వెలుగు చూడకుండా చూడటానికి పీఎఫ్ఐని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిందని తెలిసింది.

బెళగావి జైలు నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి జయేష్ పూజారి అనే వ్యక్తి పేరుతో ఫోన్ చేసి చంపుతామని అఫ్సర్ పాషా బెదిరించాడని వెలుగు చూసింది. ఈ కేసులో అఫ్సర్‌ పాషాను జూలై 14న బెళగావి నుంచి బాడీ వారెంట్ మీద జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు తీసుకెళ్లి నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో పెట్టి విచారిణ చేస్తున్నారు. ఆ సమయంలో అఫ్సర్ పాషాకు మంగళూరు కుక్కర్ బాంబుతో సంబంధం ఉన్నట్లు సమాచారం వెలుగు చూసింది.

Nitin Gadkari

కేంద్ర దర్యాప్తు సంస్థలతో పంచుకున్నామని, పాషా సమాచారం ఆధారంగా సమగ్ర నివేదికను తయారు చేస్తామని మహారాష్ట్ర పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని బెదిరించిన కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నప్పుడు మంగళూరు కుక్కర్ బాంబు పేలుడు కేసుకు అఫ్సర్ పాషా ప్రధాన సూత్రధారి అని తేలింది. కుక్కర్ బాంబును ఎలా తయారుచేయాలో అని బెళగావి జైల్లోనే మహ్మద్ షరీఫ్ కు పాషా శిక్షణ ఇచ్చాడని అధికారులు గుర్తించారు.

చాలా ఏళ్ల క్రితం బంగ్లాదేశ్‌లోని ఢాకాలో బాంబు తయారీలో శిక్షణ పొందిన అఫ్సర్ పాషా తరువాత భారత్‌కు వచ్చాడని, బెంగళూరు పేలుళ్ల కేసుల్లో ఒకదానిలో కూడా ఇతనికి ప్రమేయం ఉందని, మంగళూరు పేలుళ్ల కేసులో అంతకుముందు జరిగిన దర్యాప్తులో ఇతని పాత్రను కొందరు పోలీసు అధికారులు విస్మరించారని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

Nitin Gadkari

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని బెదిరించిన జయేష్ పూజారి అలియాస్ కాంత అలియాస్ షాహీర్ పాషా అలియాస్ అఫ్సర్ పాషా బెళగావి జైలులో ఉంటూ ఇస్లామిక్ ఛాందసవాదాన్ని ఇతర ఖైదీలకు ప్రచారం చేశారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. తోటి ఖైదీలను ప్రభావితం చేసేవాడని, కొన్ని నెలల క్రితమే పాషా ఖాతాలోకి రూ. 5 లక్షలు వచ్చాయని, పీఎఫ్ఐ ద్వారా డబ్బు వచ్చిందని అధికారుల విచారణలో వెలుగు చూసింది. లష్కర్ ఏ తోయిబా సభ్యుడు అఫ్సర్ పాషాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎన్ఐఏ అధికారులు బయటకు లాగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+