త్వరలో ఆధార్‌తో ఓటరు ఐడీ లింక్..? కానీ వయోజనుల ఇష్టంతోనే, లేదంటే రీజన్: సీఈసీ
ఆధార్‌తో ఓటర్ ఐడీ కార్డు లింక్ గురించి భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర కీలక కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి త్వరలో మార్గదర్శకాలు జారీ అవుతాయని వివరించారు. వివరాలు నమోదు చేయడంలో బలవంతం ఏమీ లేదని.. సదరు వ్యక్తి స్వతహాగా నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఒకవేళ ఎవరైనా తమ ఆధార్ నంబర్ లింక్ చేయకుంటే దానికి తగిన కారణం మాత్రం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.

ఈసీ కీ రోల్
ఈ మార్చిలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆయా చోట్ల వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టడంలో ఈసీ కీలక పాత్ర వహించిందని తెలిపారు. దీంతో ఓటర్లు కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉండగలిగారని చెప్పారు. సుశీల్ చంద్ర పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడారు. తన హయాంలో రెండు కీలక ఘట్టాలు పూర్తి కానున్నాయని తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారు తమ ఓటరు నమోదు కోసం నాలుగు తేదీలు కేటాయించారు. అలాగే తమ ఓటర్ కార్డుకు ఆధార్ లింక్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇవీ కీలక సంస్కరణలు అని తెలిపారు. దీంతో డూప్లికేట్ ఓటర్ లిస్ట్‌కు అనుసంధానం చేయాల్సి ఉంటుంది.

ఏడాదికి నాలుగుసార్లు
18 ఏళ్లు నిండిన వారు జనవరి 1వ తేదీన ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకునే వారు. దానిని ఏడాదికి నాలుగుసార్లు చేశామని తెలిపారు. ఇదీ గత 20 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉందని వివరించారు. దీనికి సంబంధించిన బిల్లును కొన్ని నెలల క్రితం పార్లమెంట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. ఎన్నికల సమయంలో చేపట్టిన చర్యలు ఫలితాలె ఇచ్చాయని చెప్పారు.

ఐదుగురికి కన్నా ఎక్కువ మందికి నో
ప్రచారంలో ఐదుగురికన్నా ఎక్కువ మందికి అనుమతి ఇవ్వలేమని వివరించారు. దీంతో ఒమిక్రాన్ వేరియంట్ అంతగా వ్యాప్తి చెందలేదని చెప్పారు. ప్రతీ రోజు సీఎస్, హెల్త్ సెక్రటరీలతో సమావేశం అయ్యానని చెప్పారు. తొలి రెండు విడతల్లో ప్రోటోకాల మేరకు నడుచుకున్నామని తెలిపారు. ప్రతీ ఒక్కరు కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకోవాలని కోరామని చెప్పారు. యూపీలో ఫస్ట్ డోస్ 100 శాతం పూర్తయ్యిందని తెలిపారు. పంజాబ్, మణిపూర్‌లో చక్కగా జరిగిందని వివరించారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications