Viral Video: లిటిల్ మీరాబాయి చాను... ఈ చిన్నారి వెయిట్ లిఫ్టింగ్‌కి నెటిజన్లు ఫిదా...

ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్‌కు రజత పతకం సాధించిన మణిపూర్ మణిపూస మీరాబాయి చాను దేశంలో కోట్లాది మంది యువతకు ప్రేరణగా నిలిచారు. ముఖ్యంగా ఆడపిల్లలకు క్రీడలు అవసరమా అనేవాళ్ల నోళ్లు మూయించారు. ఆడపిల్లలను ప్రోత్సహిస్తే అద్భుతాలు చేయగలరని నిరూపించారు. మీరాబాయి చాను స్పూర్తితో భవిష్యత్తులో మరింత మంది మహిళలు వెయిట్ లిఫ్టింగ్ వైపు దృష్టి సారించే అవకాశం ఉంది. మహిళలే కాదు చిన్నారులు సైతం మీరాబాయి నుంచి ప్రేరణ పొందుతున్నారు. తాజాగా ఓ చిన్నారి మీరాబాయి ని అనుకరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వెయిట్ లిఫ్టింగ్ ఔట్‌ఫిట్‌లో ముద్దులొలుకుతున్న ఆ చిన్నారి అచ్చు ఒలింపిక్ ఈవెంట్‌లో మీరాబాయి చేసినట్లే చేసింది. మొదట చేతులకు పౌడర్ రాసుకుని... ఆపై వెయిట్ లిఫ్టింగ్ బార్‌కు దండం పెట్టుకుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి టీవీలో మీరాబాయి చాను వైపు చూసింది. ఆమె వెయిట్ లిఫ్టింగ్ బార్‌ను ఎత్తేందుకు సిద్ధమవడంతో.. తాను కూడా తన ముందున్న వెయిట్ లిఫ్టింగ్ బార్‌ను చేతుల్లోకి తీసుకొని పైకి ఎత్తింది. అంతేనా... ఆపై మీరాబాయి చాను లాగే గాల్లోకి చేతులు ఊపుతూ గెలుపు సంబరాలు చేసుకుంది. ఈ వీడియో చూసినవారంతా లిటిల్ మీరాబాయి అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

little mirabai chanu a child imitation gone viral on social media

ఇదే వీడియోను కామన్‌వెల్త్ స్వర్ణ పతకాల విజేత సతీశ్ శివలింగమ్ ట్విట్టర్‌లో మీరాబాయి చానుకి ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన మీరాబాయి...'సో క్యూట్... జస్ట్ లవ్ దిస్...' అని కామెంట్ చేశారు. మీరాబాయి చాను గెలుపు స్పూర్తి దేశాన్ని ఎంతలా కదిలించిందో చెప్పేందుకు ఇదో ఉదాహరణ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

జపాన్‌లోని టోక్యో వేదికగా ఒలింపిక్స్ 2021 క్రీడలు జులై 23వ తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ మరుసటిరోజే భారత్‌కు చెందిన మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. భారత్ తరుపున ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన తొలి మహిళ మీరాబాయి కావడం విశేషం. అంతకుముందు,2000 సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్ తరుపున కాంస్య పతకం సాధించారు. మళ్లీ ఇన్నేళ్లకు మీరాబాయి రూపంలో వెయిట్ లిఫ్టింగ్‌లో ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం దక్కింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+