కర్ణాటకలో మరో గుండె రవాణా: ప్రాణం నిలబెట్టారు (ఫోటోలు)

బెంగళూరు: కర్ణాటకలో మరో సారి సజీవంగా ఉన్న గుండెను శాస్త్ర చికిత్స ద్వార ఇంకోకరికి అమర్చి ఒకరి ప్రాణం నిలబెట్టారు. మంగళూరు నుండి బెంగళూరుకు గుండెను తీసుకు వచ్చారు. ప్రమాదంలో గాయపడిన యువకుడి గుండె, కిడ్నీలు, అవయవాలు దానం చెయ్యడానికి అతని కుటుంబ సభ్యులు అంగీకరించారు.

దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళకు చెందిన జీవన్ విజయ్ ఫెర్నాండిస్ (24) అనే యువకుడు బైక్ ప్రమాదంలో తీవ్రగాయాలై ఆసుపత్రిలో చేరాడు. చికిత్స అందిస్తున్న సమయంలో అతని బ్రెయిన్ డెడ్ అయ్యింది. విజయ్ అవయవాలు దానం చెయ్యడానికి అతని కుటుంబ సభ్యులు అంగీకరించారు.

విషయం తెలుసుకున్న బెంగళూరులోని బీజీఎస్ ఆసుపత్రి వైద్యులు సోమవారం రాత్రి 7.45 గంటల సమయంలో ప్రత్యేక విమానంలో మంగళూరు చేరుకున్నారు. తరువాత విజయ్ చికిత్స పొందుతున్న ఎ.జే. ఆసుపత్రి చేరుకున్నారు. తరువాత విజయ్ కి శస్త్ర చికిత్స చేసి గుండె, కిడ్నీతో పాటు అవయవాలను బెంగళూరు తీసుకు వచ్చారు.

మంగళూరు నుండి బెంగళూరు

మంగళూరు నుండి బెంగళూరు

కర్ణాటకలోని మంగళూరులో ప్రాణం పోతున్న వ్యక్తి గుండెను సజీవంగా బెంగళూరుకు తీసుకు వచ్చి ఒకరి ప్రాణాలు నిలబెట్టారు. మంగళూరులోని ఎ.జే. ఆసుపత్రి, బెంగళూరులోని బీజీఎస్ ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు.

మృత్యువు దరి చేరుతూ..

మృత్యువు దరి చేరుతూ..

మృత్యువు దగ్గరకు వెళుతున్న యువకుడు మరి కోందరి ప్రాణాలు నిలబెట్టాడు. బైక్ ప్రమాదంలో తీవ్రగాయాలైన జీవిన్ విజయ్ ఫెర్నాండిస్ (24) సోమవారం రాత్రి తన గుండె, కిడ్నీలతో పాటు అవయవాలు దానం చేశాడు.

వైద్యలు సక్సెస్..

వైద్యలు సక్సెస్..

బెంగళూరులోని బీజీఎస్ ఆసుపత్రి వైద్యులు ప్రత్యేక విమానంలో మంగళూరు వెళ్లారు. తరువాత ఎ.జే. ఆసుపత్రి చేరుకుని జీవన్ కు ఆపరేషన్ చేశారు. సిగ్నల్ ఫ్రీ వ్యవస్థతో మంగళూరు సమీపంలోని బజ్పే ఎయిర్ పోర్టు చేరుకున్నారు.

ప్రత్యక విమానం, ఆంబులెన్స్

ప్రత్యక విమానం, ఆంబులెన్స్

సోమవారం రాత్రి 10 గంటల సమయంలో మంగళూరు ఎయిర్ పోర్టు చేరుకున్న వైద్యులు అక్కడి నుండి ప్రత్యేక విమానంలో బెంగళూరు బయలుదేరారు. రాత్రి 11.15 గంటల సమయంలో బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుండి పోలీసుల సహాయంతో గ్రీన్ కారిడార్ వ్యవస్థతో కంగేరిలోని బీజీఎస్ ఆసుపత్రి చేరుకున్నారు.

ప్రాణం నిలబెట్టిన జీవన్

ప్రాణం నిలబెట్టిన జీవన్

ఈనెల 10వ తేదీన శుభకార్యానికి వెళ్లిన జీవన్ విజయ్ ఫెర్నాండిస్ బైక్ లో తిరిగి వెళుతున్న సమయంలో పాదచారి అడ్డురావడంతో తప్పించడానికి ప్రయత్నించి కిందపడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చేరాడు. రెండు రోజుల తరువాత అతని బ్రెయిన్ డెడ్ అయ్యింది.

బెంగళూరు రికార్డ్

బెంగళూరు రికార్డ్

సజీవంగా ఉన్న గుండెలు తరలించి ఇతరుల ప్రాణాలు నిలబెట్టడంలో బెంగళూరు వైద్యులు సక్సెస్ అయ్యారు. 2014లో రెండు సార్లు సజీవంగా ఉన్న గుండెలను చెన్నయ్ తరలించారు. 2015 జనవరిలో బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రి నుండి బీజీఎస్ ఆసుత్రికి గుండెను తరలించారు. 2015 ఫిబ్రవరి 28వ తేది బెంగళూరు నుండి హైదరాబాద్ కు గుండెను తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+