వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ఉత్కంఠ భరిత ప్రసంగం: ప్రారంభం నుంచి చివరిదాకా పాయింట్ టూ పాయింట్

|
Google Oneindia TeluguNews

Recommended Video

    ఆర్టికల్ 370 రద్దు గురించి ప్రధాని మోడీ ప్రసంగం | Narendra Modi Address To The Nation On Article 370

    న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్ విభజన తర్వాత దేశంను ఉద్దేశించి తొలిసారిగా ప్రసంగించారు ప్రధాని మోడీ. మొత్తం 38 నిమిషాల పాటు మోడీ ప్రసంగం సాగింది. జమ్మూ కశ్మీర్‌కు విముక్తి కల్పించినట్లు ప్రధాని అన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో ఇకపై జమ్మూ కశ్మీర్ అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. జమ్మూ కశ్మీర్ తాత్కాలికంగా మాత్రమే కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుందని అది శాశ్వతం కాదని మోడీ పునరుద్ఘాటించారు. జమ్మూ కశ్మీర్‌లో ఈద్ వేడుకలు యథావిధిగా కొనసాగుతాయన్న ప్రధాని అక్కడి ప్రజలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.

    modi live

    ఆర్టికల్ 370తో జమ్మూ కశ్మీర్‌లో అభివృద్ధి కుంటున పడిందని ఇకపై పరుగులు పెడుతుందని చెప్పారు. జమ్మూ కశ్మీర్‌కు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రధాని మోడీ... ప్రజలు ఇకపై వారికి నచ్చిన ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారని చెప్పారు. జమ్మూ కశ్మీర్‌లో యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధాని ఆ రాష్ట్రాన్ని టూరిజం హబ్‌గా తయారు చేస్తామని చెప్పారు. ఇకపై కశ్మీర్‌లో సుపరిపాలన ఉంటుందని చెప్పారు ప్రధాని. ఇక జమ్మూ కశ్మీర్‌లో విధుల్లో ఉంటూ దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీసులకు జవాన్లకు సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. అమరులైన జవాన్లు స్వప్నాన్ని నిజం చేసేందుకు పనిచేయాల్సిందిగా మోడీ పిలుపునిచ్చారు.

    Newest First Oldest First
    8:39 PM, 8 Aug

    38 నిమిషాల పాటు ప్రసంగించిన మోడీ
    8:39 PM, 8 Aug

    జమ్మూ కశ్మీర్ ప్రజలకు దేశభక్తి చాలా ఉంది: మోడీ
    8:38 PM, 8 Aug

    అమరులు కన్న కలలను సాకారం చేయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది: మోడీ
    8:38 PM, 8 Aug

    విధుల్లో ఉండగా దేశంకోసం అమరులైన పోలీసులకు సెల్యూట్ చేస్తున్నాను: మోడీ
    8:37 PM, 8 Aug

    కశ్మీర్‌ ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
    8:37 PM, 8 Aug

    ఈద్ వేడుకలు యథావిధిగా కొనసాగుతాయి:మోడీ
    8:36 PM, 8 Aug

    భద్రతాదళాలకు సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పిన ప్రధాని మోడీ
    8:36 PM, 8 Aug

    ఆర్టికల్ 370 ఉగ్రవాదానికి పురుడు పోసింది: మోడీ
    8:35 PM, 8 Aug

    పాకిస్తాన్ గీసిన రూపురేఖలను జమ్మూ కశ్మీర్‌ తిరగరాస్తుంది: మోడీ
    8:33 PM, 8 Aug

    జమ్మూ కశ్మీర్‌ ప్రజలకు ఉద్యోగాలు, పర్యాటకాభివృద్ధి చేస్తామని ప్రధాని మోడీ హామీ
    8:32 PM, 8 Aug

    జమ్మూ కశ్మీర్ ప్రజల యోక్క సాధకబాధకాలను పాలుపంచుకుంటాం: మోడీ
    8:31 PM, 8 Aug

    జమ్మూ కశ్మీర్‌పై కొందరు వ్యతిరేకంగా గళం విప్పారు. వారి అభిప్రాయాలను కూడా గౌరవిస్తాను: మోడీ
    8:30 PM, 8 Aug

    లడఖ్‌కు మంచి సదుపాయాలు కల్పిస్తాం: మోడీ
    8:30 PM, 8 Aug

    టూరిస్ట్ హబ్‌లలో లడాఖ్ అగ్రస్థానంలో నిలిచే సామర్థ్యం ఉంది: మోడీ
    8:30 PM, 8 Aug

    స్థానిక ఆహార ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లను శాసించాలి: మోడీ
    8:29 PM, 8 Aug

    జమ్మూ కశ్మీర్‌ను పర్యాటక రాజధానిగా తీర్చిదిద్దుకుందాం: మోడీ
    8:29 PM, 8 Aug

    ఆర్టికల్ 370 నుంచి కశ్మీర్‌కు విముక్తి కల్పించాం: మోడీ
    8:24 PM, 8 Aug

    కేంద్రపాలిత ప్రాంతం తాత్కాలికం మాత్రమే: మోడీ
    8:22 PM, 8 Aug

    పంచాయతీలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నాయి: మోడీ
    8:22 PM, 8 Aug

    జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం: మోడీ
    8:19 PM, 8 Aug

    జమ్మూ కశ్మీర్‌లో జీవనశైలి సరళతరంగా మారుతుంది: మోడీ
    8:19 PM, 8 Aug

    అభివృద్ధిలో జమ్మూ కశ్మీర్‌ను కొత్త పుంతలు తొక్కిస్తాం: మోడీ
    8:18 PM, 8 Aug

    జమ్మూ కశ్మీర్‌కు సొంత ముఖ్యమంత్రి, సొంత కేబినెట్, సొంత ఎమ్మెల్యేలు ఉంటారు: మోడీ
    8:18 PM, 8 Aug

    జమ్మూ కశ్మీర్ ప్రజలు ఇకపై వారికి నచ్చిన నాయకుడిని ఎన్నుకుంటారు: మోడీ
    8:17 PM, 8 Aug

    లక్షల మంది జమ్మూ కశ్మీరీలకు ఓటు హక్కు కలగలేదు: మోడీ
    8:13 PM, 8 Aug

    ప్రధాని స్కాలర్‌షిప్‌లు కూడా వర్తిస్తాయి: మోడీ
    8:11 PM, 8 Aug

    పోలీసులు ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని బెనిఫిట్లు అందుతాయి: మోడీ
    8:11 PM, 8 Aug

    జమ్మూ కశ్మీర్ లడఖ్‌లలో ఇకపై అభివృద్ధి పరుగులు తీస్తుంది: మోడీ
    8:10 PM, 8 Aug

    జమ్మూ కశ్మీర్‌లో ఇకపై అన్ని భారత చట్టాలు అమలులోకి వస్తాయి: మోడీ
    8:10 PM, 8 Aug

    కార్మిక చట్టాల అమలు కూడా ఇప్పటి వరకు జరగలేదు: మోడీ
    READ MORE

    English summary
    PM Modi will be addressing the nation on Thursday days after the abogation of Article 370 and bifurcation of Jammu Kashmir bill that was passed in Parliament a couple of days ago. Nation is watching with Keen interest as what Modi is going to speak about on POK.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X