వారణాసిలో మోడీ: ఘన విజయం ఇచ్చినందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని

వారణాసి: లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది బీజేపీ. ఇక సంబురాల్లో ఆపార్టీ ఉంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ తాను పోటీ చేసిన వారణాసి నియోజకవర్గంలో ఘన విజయం సాధించడంతో అక్కడి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు అక్కడికి వెళుతున్నారు.ఈ సందర్భంగా మోడీ కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ఆ తర్వాత భారీ బహిరంగ సభలో పార్టీ కార్యకర్తలను అభిమానులను ఉద్దేశించి మాట్లాడతారు.

Prime Minister Narendra Modi will visit his parliamentary constituency Varanasi

ఇదిలా ఉంటే వారణాసిలో మోడీ 4.79 లక్షల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆదివారం రోజున తన తల్లి హీరాబెన్‌ను కలిసిన మోడీ.. ఆమె దీవెనలు తీసుకున్నారు.మే 30న సాయంత్రం మోడీ రెండవసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వారణాసిలో మోడీ పర్యటన సందర్భంగా గట్టి భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు.

May 27, 2019, 1:48 pm IST

వారణాసి

రాజకీయ పండితులు తెలుసుకోవాల్సింది ఏమిటంటే బీజేపీకి కర్నాటకలో అత్యధిక సీట్లు వచ్చాయి, ఈశాన్య భారతంలో బీజేపీ ప్రభుత్వాలున్నాయి: మోడీ
May 27, 2019, 1:47 pm IST

వారణాసి

బీజేపీ హిందీ ప్రధాన రాష్ట్రాల పార్టీ అని రాజకీయ పండితులు చెబుతున్నారు: మోడీ
May 27, 2019, 1:18 pm IST

వారణాసిలో కార్యకర్తలు ఎన్నికలను గెలుపోటములతో చూడలేదు. సరైన వారిని ఎన్నుకునేందుకు , సరైన వారిని శిక్షించారు: మోడీ
May 27, 2019, 1:14 pm IST

వారణాసి

ప్రజాస్వామ్యాన్ని సరిగ్గా అనుసరిస్తున్న పార్టీ ఒక్క బీజేపీనే. కార్యకర్తలు బీజేపీ సిద్ధాంతానికి కట్టుబడినందుకు చంపబడ్డారు: మోడీ
May 27, 2019, 1:12 pm IST

వారణాసి

భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో ఉత్తర్ ప్రదేశ్ స్థానం చాలా ప్రత్యేకం: మోడీ
May 27, 2019, 1:11 pm IST

వారణాసి

ఎన్నికల గణాంకాలలో ఓ రసాయన చర్య దాగుందనేది చాలా మంది తెలుసుకోవాలి: మోడీ
May 27, 2019, 1:10 pm IST

వారణాసి

పారదర్శకతకు, కష్టపడేతత్వానికి మారో ప్రత్యామ్నాయం లేదు: మోడీ
May 27, 2019, 1:09 pm IST

వారణాసి

ఎన్నికల తర్వాత నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. మీరు నన్ను గెలిపిస్తారనే విశ్వాసం నాకు ఉండటంతో కేదార్‌నాథ్, బద్రినాథ్ ఆలయాలకు వెళ్లాను: మోడీ
May 27, 2019, 1:07 pm IST

వారణాసి

నేను ముందుగా పార్టీ కార్యకర్తను ఆ తర్వతే దేశానికి ప్రధాన మంత్రిని: మోడీ
May 27, 2019, 12:51 pm IST

వారణాసి

ఎన్నికలు చాలా ప్రశాంత వాతావరణంలో జరిగాయి: మోడీ
May 27, 2019, 12:50 pm IST

వారణాసి

ఈ ఎన్నికల్లో ప్రజల కోసం పాటు పడేవారినే ప్రజలు గెలిపించారు: మోడీ
May 27, 2019, 12:48 pm IST

వారణాసి

నరేంద్ర మోడీ గెలుస్తాడని ప్రతి గడప చెప్పింది, ప్రతి ఇళ్లు చెప్పింది: మోడీ
May 27, 2019, 12:46 pm IST

వారణాసి

నా పై పోటీ చేసిన వారికి కూడా ధన్యవాదాలు: మోడీ
May 27, 2019, 12:45 pm IST

వారణాసి

కాశీ యాత్ర తనకు బలాన్ని మనసుకు ప్రశాంతతను ఇచ్చింది: మోడీ
May 27, 2019, 12:40 pm IST

వారణాసి

బీజేపీ కార్యకర్తగా ఎప్పుడూ పార్టీ గీసిన రేఖను దాటలేదు: మోడీ
May 27, 2019, 12:38 pm IST

వారణాసి

బీజేపీలో ఉత్సాహం నింపిన అమిత్ షాకు ధన్యవాదాలు: మోడీ
May 27, 2019, 12:37 pm IST

వారణాసి

హర హర మహదేవ్‌ నినాదంతో ఉపన్యాసాన్ని ప్రారంభించిన మోడీ
May 27, 2019, 12:35 pm IST

విపరీతమైన ఎండ కాస్తున్నప్పటికీ వారణాసి మోడీకి ఓటు వేసేందుకు తరలివచ్చింది: అమిత్ షా
May 27, 2019, 12:32 pm IST

నామినేషన్ దాఖలు చేసి ప్రజలు ఓటు వేస్తారని ఒకరు వెళ్లిపోయారు. అదే ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు. మోడీ నామినేషన్ దాఖలు చేసి ప్రచారం కూడా నిర్వహించారు: అమిత్ షా
May 27, 2019, 12:28 pm IST

వారణాసి

ప్రధాని మోడీని ఆహ్వానించిన ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్. ఘన విజయం అందించిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపిన యోగీ
May 27, 2019, 12:27 pm IST

వారణాసి

మరికాసేపట్లో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ
May 27, 2019, 11:04 am IST

ఉత్తర్ ప్రదేశ్

కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ పూజలు
May 27, 2019, 11:03 am IST

ఉత్తర్ ప్రదేశ్

కాశీ విశ్వనాథుడి ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
May 27, 2019, 10:51 am IST

ఉత్తర్ ప్రదేశ్

కాశీ విశ్వనాథ ఆలయం వీధి గుండా మోడీ కాన్వాయ్ వెళుతున్న సమయంలో మోడీ నినాదాలతో మార్మోగిన ప్రాంతం
May 27, 2019, 10:44 am IST

ఉత్తర్ ప్రదేశ్

కాశీ విశ్వనాథ్ ఆలయంకు వెళ్లే మార్గంలో ప్రజలకు ప్రధాని మోడీ అభివాదం
May 27, 2019, 10:43 am IST

ఉత్తర్ ప్రదేశ్

వారణాసిలో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా భారీగా భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు.. విశ్వనాథ ఆలయంలో మోడీ పూజలు వీక్షించేందుకు ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసిన అధికారులు
May 27, 2019, 10:38 am IST

వారణాసి

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా వారణాసిలో కళాకారుల నృత్యాలు
May 27, 2019, 10:33 am IST

ఉత్తర్ ప్రదేశ్

కోలాహలంగా మారిన వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయ పరిసరాలు
May 27, 2019, 10:31 am IST

ఉత్తర్ ప్రదేశ్

వారణాసికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+