ఎల్జేపీ విఫలమైనా.. నేతగా ఎదిగిన చిరాగ్ పాశ్వాన్
పాట్నా: ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జన్‌శక్తి పార్టీ(ఎల్జేపీ) పేలవ ప్రదర్శనే చూపింది. అయితే, చిరాగ్ మాత్రం ఎన్నికల్లో తన ప్రభావాన్ని చాటారు. నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూనే లక్ష్యంగా చేసుకుని ఆయన ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే.
చిరాగ్ పాశ్వాన్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఎక్కువగా జేడీయూ పోటీ చేసిన స్థానాల్లోనే చిరాగ్ పాశ్వాన్ పార్టీ అభ్యర్థులు పోటీ చేయడం గమనార్హం. దీంతో జేడీయూ ఓట్లను చీల్చి ఆ పార్టీ అభ్యర్థుల ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది ఎల్జేపీ.

బీహార్ ఎన్నికల్లో 42 స్థానాల్లో పోటీ చేసిన ఎల్జేపీ కేవలం ఒకే ఒక్క స్థానంలోనే గెలుపొందింది. అది కూడా పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ విజయం సాధించారు. అయితే, చిరాగ్ పాశ్వాన్ పార్టీ సుమారు 5 శాతం కంటే ఎక్కువగానే ఓటు షేర్ సాధించడం గమనార్హం.
జేడీయూ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఎల్జేపీ అభ్యర్థులు పోటీ చేశారు. దాదాపు 40 స్థానాల్లో జేడీయూ ఓటమికి ఎల్జేపీనే కారణం కావడం గమనార్హం. ఎన్డీఏ, బీజేపీపై విమర్శలు చేయకుండా కేవలం నితీష్ కుమార్‌నే లక్ష్యం చేసుకుని చిరాగ్ పాశ్వాన్ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. చిరాగ్ పాశ్వాన్ తాను అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేశారు.
తన తండ్రి రాంవిలాస్ పాశ్వాన్ ఎన్నికల ముందే మృతి చెందినప్పటికీ.. చిరాగ్ పాశ్వాన్ తన భుజాలపైన పార్టీ బాధ్యతలను తీసుకుని పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ విస్తృతంగా పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోడీకి తాను భక్తుడినంటూనే.. నితీశ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బీహార్ ఓటర్లను ఆకట్టుకోవడంలో చిరాగ్ పాశ్వాన్ కొంతమేర విజయవంతమైనట్లేనని చెప్పవచ్చు. రాబోయే ఎన్నికల్లో తన ప్రభావం మరింత ఉండనుందని ఈ ఫలితాల ద్వారా తెలియజేవారు ఈ యువనేత.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications