తెరపై మోదీ, రధసారధులు వారే - రామాలయం కల సాకారం వెనుక..!!
దేశం మొత్తం అయోధ్య వైపు చూస్తోంది. అయోధ్యలో భవ్యమైన రామమందిరంలో బాల రాముడు కొలువుదీరుతున్నాడు. అతిరధ మహారధులు తరలి వస్తున్నారు. అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబు అయింది. ప్రధాని మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. కోట్లాది మంది హిందువుల కల సాకారం అవుతున్న ఉద్విగ్న క్షణాల వేళ ఎన్నో ఘటనలు గుర్తుకు వస్తున్నాయి. నేడు తెర పైన మోదీ కనిపిస్తున్నా.. ఆ ఆలయం సాకారం వెనుక పలువురు ప్రముఖులు కీలక పాత్ర పోషంచారు.
రధయాత్రలో కీలక మలుపు: జగమంతా రామోత్సవం అన్నట్లుగా దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపిస్తోందది. కోట్లాది మంది కల సాకారం చేస్తూ అయోధ్యలో బాల రాముడు కొలువు దీరుతున్నాడు. కానీ, ఈ మందిర నిర్మాణం అంత సులువుగా జరగిపోలేదు. రామ జన్మభూమి ఉద్యమం పేరుతో ఎంతో మంది చేసిన కృషి ఫలితమే ఈ ఆలయం. రామ జన్మభూమి ఉద్యమం అనగానే గుర్తొచ్చే మొట్టమొదటి పేరు అద్వానీ. అయోధ్య రామాలయం అంశాన్ని రాజకీయ, సామాజికంగా చొచ్చుకుపోయేలా చేసారు.

1990లోఒక టొయోటా మినీ ట్రక్కును రథంగా మార్చి గుజరాత్‌లోని సోమ్‌నాథ్ ఆలయం నుంచి అయోధ్యలో రామజన్మభూమి దాకా ఆయన ప్రారంభించిన యాత్రకు విస్తృత మద్దతు లభించింది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో 2 సీట్లతో ప్రస్థానం ప్రారంభించిన బీజేపీని వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చి రామమందిరాన్ని నిర్మించడానికి అవసరమైన మద్దతు రావటంలో అద్వానీదే కీలక పాత్ర.
రామాలయం సాధనలో: అయోధ్య ఉద్యమంలో భాగంగా ఆడ్వాణీ తొలుత సోమ్‌నాథ్ నుంచి అయోధ్య దాకా పాదయాత్ర చేపట్టాలని భావించారు. అయితే, రాముడి రథం లాంటిదాంట్లో యాత్ర చేపడితే బాగుంటుందని, ప్రజల్లోకి బాగా వెళ్తుందని అప్పటి బీజేపీ జనరల్ సెక్రటరీ ప్రమోద్ మహాజన్ సూచించారు. ఆయన ఇచ్చిన రథయాత్ర ఐడియా అద్భుతంగా వర్కవుట్ అయ్యింది.
రథయాత్ర సక్సెస్ అయింది. ఉద్యమానికి అశోక్ సింఘాల్ ప్రధాన రూపకర్తగా మారి ముందుకు నడిపించారు. 1980లో రామజన్మభూమి తాళాలు తెరవాలని కోరుతూ.. రామ్‌జానకీ రథయాత్రను నిర్వహించారు. ఆయన కృషి వల్లనే కరసేవ ఉద్యమం కూడా మొదలైంది. బాబ్రీమసీదు తాళాలు తెరుచుకున్న తర్వాత.. అక్కడ ఆలయం కట్టాలనే ఉద్యమానికి తెరతీశారు.

తెర పై మోదీ - నాటి ఉద్యమంలో: అద్వానీ చేపట్టిన రథయాత్రలో 'సెకండ్-ఇన్-కమాండ్'గా వ్యవహరించిన కీలక వ్యక్తి మురళీ మనోహర్‌జోషీ. ఉమాభారతి నాటి రామ మందిర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. రామ మందిర నిర్మాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఏర్పాటైన సంస్థ బజ్‌రంగ్ దళ్‌కు తొలి అధ్యక్షుడు వినయ్ కతియార్.
ఇక, బాబ్రీ కూల్చివేత జరిగిన సమయంలో యూపీ సీఎం కల్యాణ్ సింగ్. 1991 జూన్‌లో ఆయన సీఎంగా ప్రమాణం చేయడానికి ముందే రామ్‌లల్లా విగ్రహం వద్దకు వెళ్లి తన పాలనలోనే అక్కడ రామమందిర నిర్మాణం జరిపించి తీరుతానని ప్రతిజ్ఞ చేశారు. రామమందిర నిర్మాణ ఉద్యమంలో అత్యంత కీలక ఘట్టం అదే. రామ మందిరం ప్రారంభం వేళ వీరిని బీజేపీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications