కారు ఆపితే యువతి హంగామా ..పోలీసు చెయ్యి కొరికి రక్తం వాళ్ళ మీదే పూసి హల్చల్
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి . ఇక ఈ నేపధ్యంలో ప్రజలు బయటకు రావద్దని చెప్పినా వినకున్నా బయటకు వస్తున్న పరిస్థితులు ప్రభుత్వాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక ఈ క్రమంలో పోలీసులు బయట తిరుగుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే క్రమంలో ఒక క్యాబ్ లో ప్రయాణిస్తున్న యువతిని ఆపిన పోలీసులు ఆమె చేసిన పనికి ఖంగుతున్నారు .

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో రోడ్ పై యువతి హంగామా
తన కారును రోడ్డుపై ఆపినందుకు ఓ యువతి నడిరోడ్డుపై నానా హంగామా చేసింది. దేశం మొత్తం లాక్‌డౌన్ చేస్తే బయటకు వస్తున్న ప్రజలను ఎందుకు బయటకు వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు పోలీసులు . ఇక అలా ఎందుకు తిరుగుతున్నారంటూ ప్రశ్నించిన పోలీసుల మీద ఆ యువతి వీరంగం వేశారు . పోలీసులతో గొడవ పెట్టుకోవడమే కాకుండా.. ఏకంగా ఓ పోలీస్ ఆఫీసర్ చేతిని కొరికింది. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కారు ఆపి ప్రశ్నించినందుకు రెచ్చిపోయిన యువతి
కోల్‌కతాలో నిర్మానుష్యంగా ఉన్న ఓ రోడ్డు మీద ఒక యువతి క్యాబ్ లో వస్తుండడం చూసి పోలీసులు ఆపారు. లాక్ డౌన్ అని ప్రకటించినా , బయట తిరగవద్దు అని చెప్పినా ఈ సమయంలో బయట ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు పోలీసులు . తాము మెడిసిన్స్ తీసుకురావడానికి వచ్చామన్నారు. ప్రిస్కిప్షన్ అడిగితే లేదన్నారు. ఇంతలో కారులో కూర్చున్న ఓ యువతి బయటకు వచ్చి వారితో వాగ్వాదానికి దిగింది. ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయింది .
Recommended Video

పోలీస్ చెయ్యి కొరికి, తన గాయాన్ని గిచ్చి రక్తం పూసి రచ్చ .. కేసు నమోదు
ఇక ఆమె వెంట ఉన్న ఓ యువకుడు కూడా బయటకు వచ్చి పోలీసులతో గొడవకు దిగాడు. ఇంతలో ఆ యువతి మరింత రెచ్చిపోయి అక్కడ ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ చేయి కొరికేసింది. అక్కడితో ఆగిపోకుండా చాలా దారుణంగా ప్రవర్తించింది . గతంలో యువతికి తగిలిన దెబ్బను గిచ్చి అక్కడ వచ్చిన రక్తాన్ని పోలీస్ ఆఫీసర్ డ్రెస్ మీద వేసింది. ఇక దీంతో ఖగు తిన్న పోలీసులు చూస్తూ ఉండిపోయారు. ఇక అనంతరం ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయినా ఆ తరువాత ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. సదరు యువతి చేసిన పనికి తాలూకు వీడియో వైరల్ గా మారటంతో ఇప్పుడు ఇది దేశ వ్యాప్తంగా చర్చకు కారణం అవుతుంది.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications