లాక్ డౌన్ పొడగింపు.. మరో 2 వారాలు... కేసులు పెరుగుతున్నందునే..

దేశంలో కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. సెకండ్ వేవ్‌లో కూడా కర్ణాటకలో అత్యధిక సంఖ్యలో కేసులు వస్తున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే లాక్ డౌన్ అమల్లో ఉంది. అయితే మరో రెండు వారాలు పొడగిస్తూ యడియూరప్ప సర్కార్ నిర్ణయం తీసుకుంది. కరోనా నివారణ కోసం లాక్ డౌన్ తప్ప మరో మార్గం లేదని చెబుతోంది.

lock down extends two weeks in karnataka

గత 24 గంటల్లో 32 వేలకు పైగా కొత్త కరోనా కేసులు వచ్చాయి. 353 మంది చనిపోయారు. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. జూన్ 7 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. నిత్యావసర వస్తువులు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్యలో కొనుగోలు చేయాలని సీఎం యడియూరప్ప సూచించారు.

Recommended Video

    CoviSelf | Mylab Self-Testing Covid Kit | Covid-19 Test At Home | Oneindia Telugu

    లాక్ డౌన్ ఆంక్షలను ఉల్లంఘించిన వారిని ఉపేక్షించవద్దని పోలీసులకు, అధికారులకు స్పష్టం చేశారు. కర్ణాటకలో మే 10 నుంచి 24వ తేదీ వరకు తొలుత లాక్ డౌన్ ప్రకటించినా, కేసుల ఉద్ధృతితో పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. కరోనా సెకండ్‌తో పాటు బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. ఈ కేసులు కూడా చాపకింద నీరులా బయటకు వస్తున్నాయి. మరోవైపు వైట్ ఫంగస్ కూడా ఆందోళన కలిగిస్తోంది. కానీ వైద్యులు వైట్ ఫంగస్ అంతా తీవ్రమైనది కాదని చెబుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+