అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !

చెన్నై/ తిరువళ్లారు: జీవితాంతం నిన్ను సంతోషంగా చూసుకుంటానని నమ్మించిన యువకుడు అత్త కూతురిని పెళ్లి చేసుకున్నాడు. లాక్ డౌన్ లోనే వివాహం చేసుకున్న దంపతులు రాత్రి వరకు చాలా సంతోషంగా ఉన్నారు. అర్దరాత్రి బెడ్ రూంలో నుంచి యువతి అరుపులు, కేకలు వినిపించాయి. మొదటి రాత్రి కదా, భార్య, భర్త సరసాలు ఆడుతున్నారని కుటుంబ సభ్యులు, బంధువులు ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే ఫస్ట్ నైట్ జరగరాని దారుణం జరిగిపోయింది. పెళ్లి కూతురిని ఆ మానవ మృగం గడ్డపారతో అతి దారుణంగా హత్య చేశాడు. బెడ్ రూం నుంచి పారిపోయిన భర్త తరువాత ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లైన రోజు ఫస్ట్ నైట్ భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురి కావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేస్తున్నారు.

 కుప్పం అత్త కూతురు సంధ్యతో లవ్

కుప్పం అత్త కూతురు సంధ్యతో లవ్

తమిళనాడులోని తిరువళ్లారు జిల్లా పొన్నేరి సమీపంలోని సోమంజేరి గ్రామంలో నిధివాసన్ (27) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. నిధివాసన్ క్రేన్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. నిధివాసన్ అత్త కుమార్తె సంధ్య (22) సడయన్ కుప్పంలో నివాసం ఉంటున్నది. నిధివాసన్, సంధ్యను ప్రేమించాడు. నిన్నేప్రేమిస్తున్నా, నిన్నేపెళ్లాడుతా అంటూ సంధ్యను నిధివాసన్ నమ్మించాడు.

 లాక్ డౌన్ లో పెళ్లి

లాక్ డౌన్ లో పెళ్లి

నిధివాసన్, సంధ్య ఇష్టపడటంతో వారి పెళ్లి చెయ్యడానికి ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. లాక్ డౌన్ అమలు కాకముందే నాలుగు నెలల క్రితం జూన్ 10వ తేదీన నిధివాసన్, సంధ్యల వివాహం బంధువులు అందర్ని పెలిచి వైభవంగా చెయ్యాలని పెద్దలు నిర్ణయించారు. అయితే లాక్ డౌన్ అమలు కావడంతో ముందుగా నిర్ణయించిన జూన్ 10వ తేదీన కొద్ది మంది బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఓ ఆలయంలో నిధివాసన్, సంధ్యల వివాహం జరిగింది.

 భారీగా కట్నం, బైక్, బంగారం

భారీగా కట్నం, బైక్, బంగారం

నిధివాసన్ కు సంధ్య కుటుంబ సభ్యులు భారీగానే కట్నం కింద డబ్బులు, కొత్త బైక్, బంగారు నగలు, ఇంటికి అవసరం అయిన అన్ని వస్తువులు తీసిచ్చారు. పెళ్లి జరిగిన తరువాత కొన్ని గంటల పాటు నిధివాసన్, సంధ్య చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. తమ కుమార్తెను పెళ్లి జరిగిపోయిందని, ఇక ఎలాంటి కష్టాలు ఉండవని సంధ్య కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారు.

 ఫస్ట్ నైట్ బెడ్ రూంలో కేకలు, అరుపులు

ఫస్ట్ నైట్ బెడ్ రూంలో కేకలు, అరుపులు

వివాహం జరిగిన రోజే పెళ్లి కుమార్తె సంధ్య ఇంటిలో మొదటి రాత్రికి అన్ని ఏర్పాట్లు చేశారు. రాత్రి పొద్దుపోయిన తరువాత నవదంపతులు సంధ్య, నిధివాసన్ బెడ్ రూంలోకి వెళ్లారు. అర్దరాత్రి బెడ్ రూంలో నుంచి సంధ్య గట్టిగా అరుపులు చేస్తూ కేకలు వేసిన విషయం బంధువులకు వినపడింది. ఫస్ట్ నైట్ లో నవ దంపతులు సరసాలు ఆడుతున్నారని బంధువులు ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. సుమారు గంటకు పైగా కేకలు వేసిన సంధ్య తరువాత సైలెంట్ అయిపోవడంతో ఫస్ట్ నైట్ తో దంపతులు అలిసిపోయారని నవ్వుకున్న బంధువులు నిద్రపోయారు.

 ఫస్ట్ నైట్ గడ్డపార దించేసి చంపేశాడు

ఫస్ట్ నైట్ గడ్డపార దించేసి చంపేశాడు

ఉదయం బెడ్ రూం తలుపులు తీసి బయటకు వచ్చిన నిధివాసన్ గట్టిగా కేకలు వేస్తూ ఇంటి నుంచి పరుగు తీశాడు. పెళ్లి కొడుకు అలా పారిపోవడంతో వారి బంధువులకు అనుమాన వచ్చి బెడ్ రూంలోకి వెళ్లి చూశారు. సంధ్య రక్తపుమడుగులో శవమై కనిపించడంతో షాక్ కు గురైన ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పెళ్లి కొడుకు నిధివాసన్ భార్య సంధ్య శరీరంపై ఎక్కడపడితే అక్కడ గడ్డపారతో పోడిచి అతి దారుణంగా హత్య చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 గంజాయి, మద్యం దెబ్బ

గంజాయి, మద్యం దెబ్బ

సంధ్యను హత్య చేసిన పెళ్లి కొడుకు కోసం పోలీసులు గాలించారు. సాయంత్రం గ్రామం సమీపంలోని ఓ పెద్ద చెట్టుకు పెళ్లి కొడుకు నిధివాసన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విసయం వెలుగు చూసింది. పెళ్లి కొడుకు నిధివాసన్ కొన్ని సంవత్సరాల నుంచి గంజాయి, మద్యం సేవించడానికి అలవాటు పడి వాటికి బానిస అయిపోయాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మానసిక వైద్యుడి దగ్గర సుమారు మూడు నెలలకు పైగా నిధివాసన్ చికిత్స చేసుకున్నాడని పోలీసులు అన్నారు. ఈ విషయం బయటకు రావడంతో సంధ్య కుటుంబ సభ్యులు నిశ్చితార్థం జరిగిన తరువాత పెళ్లి చెయ్యడానికి నిరాకరించారు.

Recommended Video

    AP CM YS Jagan Writes Letter To Union External Affairs Minister || Oneindia Telugu
     ఒక్క డైలాగ్ తో పడేశాడు

    ఒక్క డైలాగ్ తో పడేశాడు

    అయితే గంజాయి, మద్యం సేవించడం పూర్తిగా నిలిపివేస్తానని మాయమాటలు చెప్పి నమ్మించిన నిధివాసన్ అత్తకూతురు సంధ్యను పెళ్లి చేసుకున్నాడని పోలీసులు అన్నారు. గంజాయి, మద్యంకు బానిస అయిన మానసికరోగి నిధివాసన్ ఫస్ట్ నైట్ భార్య సంధ్యను అతిదారుణంగా హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. పెళ్లి జరిగి 24 గంటలు కూడా పూర్తి కాకముందే భార్య సంధ్యను హత్య చేసిన నిధివాసన్ ఆత్మహత్య చేసుకోవడంతో రెండు కుటంబాల్లో విషాదం నెలకొనింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+