వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ .. నేడు మార్గదర్శకాలు, నిబంధనలు వెల్లడించనున్న మహా సీఎం ఉద్ధవ్ ఠాక్రే !!

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. విపరీతంగా పెరుగుతున్న కేసులు మహారాష్ట్రలో దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆసుపత్రిలో వైద్య సదుపాయాల కొరత మహారాష్ట్రను పట్టిపీడిస్తోంది. ఇక కరోనా మహా రాష్ట్ర ప్రజలను వణికిస్తోంది. రాష్ట్రంలో కంట్రోల్ చేయలేని విధంగా పెరిగిపోయిన కరోనా కేసుల నేపధ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కఠినమైన కోవిడ్ ఆంక్షలకు రెడీ అవుతోంది . అయితే ఇది గత సంవత్సరం విధించిన లాక్ డౌన్ లా ఉండకపోవచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

మహారాష్ట్రలో మరణ మృదంగం : ఆస్పత్రులలో ఆక్సిజన్ కొరత, ఒకే ఆస్పత్రిలో ఒకే రోజు ఏడుగురు మృతితో ఉద్రిక్తతమహారాష్ట్రలో మరణ మృదంగం : ఆస్పత్రులలో ఆక్సిజన్ కొరత, ఒకే ఆస్పత్రిలో ఒకే రోజు ఏడుగురు మృతితో ఉద్రిక్తత

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈరోజు రాత్రి 8:30 గంటలకు ప్రకటన

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈరోజు రాత్రి 8:30 గంటలకు ప్రకటన

కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రయత్నిస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం తయారుచేసిన నిబంధనలను, మార్గదర్శకాలను ప్రకటించడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈరోజు రాత్రి 8:30 గంటలకు ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్రలో విధించే కఠిన ఆంక్షలపై తీసుకునే నిర్ణయాలు ఈ విధంగా ఉంటాయి అన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

ఈసారి మహారాష్ట్రలో విధించే లాక్ డౌన్ గత సంవత్సరం మాదిరిగా పూర్తి స్థాయి లాక్‌డౌన్ కాదని తెలుస్తుంది .

రేపు రాత్రి నుండి ఏప్రిల్ 30 వరకు 15 రోజులు లాక్ డౌన్ .. కఠినమైన ఆంక్షలు విధించే అవకాశం

రేపు రాత్రి నుండి ఏప్రిల్ 30 వరకు 15 రోజులు లాక్ డౌన్ .. కఠినమైన ఆంక్షలు విధించే అవకాశం

రవాణా సేవలు, ఇతర రాష్ట్రాలకు మరియు అంతర్గత రవాణా సేవలు రెండూ పనిచేసే అవకాశం ఉంది.

రేపు రాత్రి నుండి ఏప్రిల్ 30 వరకు 15 రోజులులాక్ డౌన్ విధించి , కఠినమైన ఆంక్షలు విధించే అవకాశం ఉంది . అవసరమైన సేవలు కాకుండా ప్రైవేట్ కార్యాలయాలు , పాఠశాలలు, కళాశాలలు మూతపడే అవకాశం ఉంది. థియేటర్లు, ప్లే గ్రౌండ్ లు , పార్కులు, జిమ్‌లు మూసివేసే అవకాశం ఉంది .
టేక్ ఎవే ల కోసం మాత్రమే రెస్టారెంట్లు తెరిచి ఉంటాయి. బహిరంగ సభలపై ఆంక్షలు ఉండే అవకాశం ఉంది.

బలహీన వర్గాలకు లాక్ డౌన్ సమయంలో ఆర్థిక సహాయ ప్యాకేజీపై ప్రకటన చేసే అవకాశం

బలహీన వర్గాలకు లాక్ డౌన్ సమయంలో ఆర్థిక సహాయ ప్యాకేజీపై ప్రకటన చేసే అవకాశం

సమాజంలోని బలహీన వర్గాలకు లాక్ డౌన్ సమయంలో ఆర్థిక సహాయ ప్యాకేజీపై ప్రభుత్వం పనిచేసే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.

ఇప్పటికే కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒకటే మార్గం అని మహారాష్ట్ర సర్కార్ ప్రకటించింది . దీనిపై ప్రజలకు అసౌకర్యం కలగకుండా కసరత్తు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది . ఒకపక్క బీజేపీ నేతలు లాకా డౌన్ మంచిది కాదని చెప్తున్నా సరే మహా సర్కార్ లాక్ డౌన్ తప్ప ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేసింది .

రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా కరోనా కేసులు

రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా కరోనా కేసులు

ఇక మహారాష్ట్రలో కరోనా సోమవారం 258 మరణాలతో, 51,751 తాజా కేసులతో కల్లోలం సృష్టిస్తోంది. ప్రస్తుతం, రాష్ట్రంలో మరణాల సంఖ్య 1.68% గా ఉంది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా 2,23,22,393 నమూనాలను పరిశీలించగా 34,58,996 మంది ఈ రోజు వరకు కోవిడ్ -19 కోసం పాజిటివ్ (15.49%) గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం, 32,75,224 మంది హోమ్ క్వారంటైన్ లో, 29,399 మంది ఐసోలేషన్ లో ఉన్నారు. ఏప్రిల్ 12, సోమవారం నాటికి, మహారాష్ట్ర రాష్ట్రంలో 5,64,746 క్రియాశీల కేసులు ఉన్నాయి.

English summary
Maharashtra Chief Minister Uddhav Thackeray will be addressing the public live through social media at 8:30 pm today to announce new Covid control SOPs.The Maharashtra government is preparing to announce lockdown , but it was not like last year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X