• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Lockdown: సార్.... నా లోదుస్తులు చినిగిపోయాయి, బట్టలు షాప్ లు తీపించండి, సీఎంకు లెటర్ !

|

బెంగళూరు/మైసూరు: కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమా అంటూ ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఎన్నడూ లేని విధంగా కొన్ని కోట్ల మంది రోజుకు ఒక్కపూట భోజనంతో సరిపెట్టుకున్న రోజులు ఇదే కరోనా కాలంలో చూస్తున్నాము. భోజనం చెయ్యడానికి కష్టంగా కన్న సమయంలో నిరుపేద ప్రజలకు ప్రభుత్వం ఆహారధాన్యాలు అందిస్తోంది. అయితే ఓ రిటైడ్ అధికారి ముఖ్యమంత్రికి లేఖరాసి ఆయనకు సినిమా చూపించారు. అయ్యా సీఎం గారు, నాకు రెండు జతలు మాత్రమే లోదుస్తులు ఉన్నాయి. రోజూ ఉతుక్కొని ఆరేసుకుని మళ్లీ వేసుకుని నానా ఇబ్బందులు పడుతున్నాను, అవి చినిగిపోతున్నాయి, నా పరిస్థితి ఇలాగుంటే నాలాగా చాలా మంది అమ్మాయిలు, మహిళలు కూడా ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారని నేను అనుకుంటున్నాను. దయచేసి లాక్ డౌన్ లో వారంలో ఒకరోజు బట్టలు షాపు తెరిపించండి మహాప్రభో అంటూ సీఎంకు లేఖ రాయడం హాట్ టాపిక్ అయ్యింది.

Lady teacher: కత్తిలాంటి మేడమ్, కండలు తిరిగిన విద్యార్థి రొమాన్స్, ఎస్కేప్, కిడ్నాప్ కేసుతో!Lady teacher: కత్తిలాంటి మేడమ్, కండలు తిరిగిన విద్యార్థి రొమాన్స్, ఎస్కేప్, కిడ్నాప్ కేసుతో!

చుక్కలు చూపిస్తున్న కరోనా వైరస్

చుక్కలు చూపిస్తున్న కరోనా వైరస్

కరోనా వైరస్ (COVID-19)మహమ్మారి పుణ్యమా అంటూ ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఎన్నడూ లేని విధంగా కొన్ని కోట్ల మంది రోజుకు ఒక్కపూట భోజనంతో సరిపెట్టుకుంటూ ఆకలితో అలమటిస్తున్నారు. కరోనా కాలంలో భోజనం చెయ్యడానికి కష్టంగా కన్న సమయంలో నిరుపేద ప్రజలకు ప్రభుత్వం ఆహారధాన్యాలు (రేషన్) అందిస్తోంది.

కరోనా సెకండ్ వేవ్........రెండోసారి లాక్ డౌన్

కరోనా సెకండ్ వేవ్........రెండోసారి లాక్ డౌన్


కరోనా సెకండ్ వేవ్ దెబ్బతో దేశంలోని ప్రజలు మరోసారి ఉలిక్కిపడ్డారు. కుప్పలు కుప్పలుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో, కోవిడ్ వ్యాధితో రోజూ కొన్ని వేల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో దేశంలో మరోసారి 98 శాతం లాక్ డౌన్ అమలు చేశారు. దేశంలో రెండోసారి లాక్ డౌన్ అమలు కావడంతో సామాన్య ప్రజల జీవితాలు మరోసారి తల్లకిందులైనాయి.

సీఎంకు షాక్ ఇచ్చిన రిటైడ్ అధికారి

సీఎంకు షాక్ ఇచ్చిన రిటైడ్ అధికారి

కర్ణాటకలోని మైసూరు నగరంలో చామరాజేంద్ర కృష్ణరాజపురంలో జ్యుడిషియల్ డిపార్ట్ మెంట్ రిటైడ్ అధికారి నరసింహమూర్తి నివాసం ఉంటున్నారు. రిటైడ్ అధికారి నరసింహమూర్తి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు లేఖ రాశారు. సర్వసాధారణంగా వారి కష్టాలు చెప్పుకోవడానికి సీఎంకు రాస్తున్న లేఖలను పరిశీలిస్తున్న అధికారులు రిటైడ్ అధికారి నరిసంహమూర్తి రాసిన లేఖను పరిశీలించారు. అంతే రిటైడ్ అధికారి నరసింహమూర్తి రాసిన లేఖ చదివిన అధికారులు మైండ్ బ్లాక్ అయ్యింది.

రోజూ డ్రాయర్, బనీన్లు ఉతుక్కోలేకపోతున్నాను

రోజూ డ్రాయర్, బనీన్లు ఉతుక్కోలేకపోతున్నాను

కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్పకు రాసిన లేఖలో రిటైడ్ అధికారి నరసింహమూర్తి ఆయన మనసులోని బాధను ఇలా చెప్పారు. గౌరవనీయులైన కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప గారికి నమస్కారం. సార్... నా డిమాండ్ మీకు వింతగా, విచిత్రంగా అనిపించ వచ్చు, అయితే మీరు నా పరిస్థితి అర్థం చేసుకోవాలి, నేను వేసుకోవడానికి కేవలం రెండు జతలు లోదుస్తులు (డ్రాయర్లు, బనీన్లు) మాత్రమే ఉన్నాయి. వాటిని రోజూ ఉతుక్కుని ఆరవేసుకుని వేసుకుంటున్నాను, కొత్తవి తీసుకోవాలంటే లాక్ డౌన్ దెబ్బతో ఒక్క బట్టలు షాపు తియ్యడం లేదు. నా లోదుస్తులు చినిగిపోయేలా ఉన్నాయి, నన్ను ఏమి చెయ్యమంటారో మీరే చెప్పండి అని ప్రశ్నించారు.

 నాలాగే ఎంతో మంది అమ్మాయిలు, మహిళలు

నాలాగే ఎంతో మంది అమ్మాయిలు, మహిళలు

లాక్ డౌన్ దెబ్బ కారణంగా ప్రభుత్వ అధికారుల ఆదేశాలతో బట్టల దుకాణాలు పూర్తిగా మూతపడిపోయాయి, నిత్యవసర వస్తువులు, పండ్లు, పూలు, పాలు చివరికి లిక్కర్ కొనుక్కోవడానికి అధికారులు అవకాశం ఇస్తున్నారు, బట్టల దుకాణం కూడా ప్రజలు నిత్యవసర వస్తువుల జాబితాలో చేర్చాలని రిటైడ్ అధికారి సీఎం యడియూరప్పకు మనవి చేశారు. నేను నా భాదను మీతో చెప్పుకుంటున్నాను, నాలాగే చాలా మంది అమ్మాయిలు, మహిళలు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని నేను అనుకుంటున్నాను, నేను చెప్పుకుంటున్నాను, వాళ్లు చెప్పుకోలేకపోతున్నారని రిటైడ్ అధికారి నరసింహమూర్తి సీఎం యడియూరప్పకు రాసిన లేఖలో వివరించారు.

ఒకేఒక్క చాన్స్ ఇవ్వండి సార్

ఒకేఒక్క చాన్స్ ఇవ్వండి సార్


వారంలో ఒక్కరోజు బట్టల దుకాణాలు తియ్యడానికి అనుమతి ఇవ్వాలని మీరు ఆదేశించాలని రిటైడ్ అధికారి నరసింహమూర్తి కర్ణాటక సీఎం యడియూరప్పకు మనవి చేస్తూ లేఖ రాశారు. లాక్ డౌన్ సమయంలో చాలా మంది మాకు ఆహారం అందడం లేదని, ఆర్థిక సమస్యలు ఉన్నాయని, పని లేదని సీఎంకు లేఖలు రాస్తుంటే రిటైడ్ అధికారి నరసింహమూర్తి లోదుస్తులు లేవని లేఖ రాయడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు.

English summary
Karnataka Judicial department retired officer wrote a letter to Karnataka CM BS Yeddyurappa for his innerwear problem.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X