బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Unlock 3.0: ఐటీ హబ్ లో రిలాక్స్, అన్ని ఐటీ సంస్థలు, కంపెనీలకు గ్రీన్ సిగ్నల్, కొన్నింటికి బ్రేక్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ సెకండ్ వేవ్ దెబ్బతో అమలు చేసిన లాక్ డౌన్ నియమాలను కర్ణాటక ప్రభుత్వం దాదాపుగా సడలించింది. unlock 3.0తో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. సోమవారం ఉదయం నుంచి ఐటీ హబ్ బెంగళూరు సిటీతో పాటు కర్ణాటకలో అన్ని వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటున్నాయి. కర్ణాటకలోని హాసన్, కొడుగు జిల్లాలు మినహాయించి అన్ని జిల్లాల్లో దాదాపుగా లాక్ డౌన్ నియమాలు సడలించారు. మాల్స్, ఐటీ కంపెనీలు, కార్పోరేట్ సంస్థలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పూర్తి సిబ్బంది పని చెయ్యడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మూడు నెలలుగా మూతపడిన దేవాలయాల్లో దైవ దర్శనానికి అనుమతి ఇచ్చింది. పబ్ లు మినహాయించి బార్ లు, బార్ అండ్ రెస్టారెంట్లలో మందు బాబులు పీకలదాక మద్యం సేవించడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. శుభకార్యాలు నిర్వహించుకోవడానికి చాన్స్ చిక్కింది. కర్ణాటకలో అన్ని వాహనాల్లో పూర్తి సీట్లలో ప్రయాణికులు సంచరించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Illegal affair: ఆంటీతో అక్రమ సంబంధం, చంపేసి ఇంట్లో పూడ్చేశాడు. చిన్న పొరపాటుతో !Illegal affair: ఆంటీతో అక్రమ సంబంధం, చంపేసి ఇంట్లో పూడ్చేశాడు. చిన్న పొరపాటుతో !

మే 10వ తేదీ బోమ్మ పడింది

మే 10వ తేదీ బోమ్మ పడింది

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ తాండవం చెయ్యడంతో మే 10వ తేదీన కర్ణాటకలో లాక్ డౌన్ 3.0 అమలు చేశారు. లాక్ డౌన్ 3.0 దెబ్బతో కర్ణాటకలోని దేవాలయాలు పూర్తిగా మూసివేశారు. ఆ రోజు మూసివేసిన దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు సోమవారం (జులై 5వ తేది) నుంచి

భక్తులు వెళ్లి దైవ దర్శనం చేసుకుని స్వామివారిని దర్శించుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.

 వ్యాపారాలకు గ్రీన్ సిగ్నల్

వ్యాపారాలకు గ్రీన్ సిగ్నల్

కరోనా వైరస్ సెకండ్ వేవ్ దెబ్బతో అమలు చేసిన లాక్ డౌన్ నియమాలను కర్ణాటక ప్రభుత్వం దాదాపుగా సడలించింది. సోమవారం ఉదయం నుంచి ఐటీ హబ్ బెంగళూరు సిటీతో పాటు కర్ణాటకలో అన్ని వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటున్నాయి. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అన్ని వ్యాపారాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఇస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప చెప్పారు.

మాల్స్, ఐటీ కంపెనీలు, లిక్కర్ షాపులకే ఓకే

మాల్స్, ఐటీ కంపెనీలు, లిక్కర్ షాపులకే ఓకే

కర్ణాటకలో రెండు జిల్లాలు మినహాయించి ఐటీ హబ్ బెంగళూరు సిటీతో పాటు అన్ని జిల్లాల్లో మాల్స్, ఐటీ కంపెనీలు, కార్పోరేట్ సంస్థలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పూర్తి సిబ్బంది పని చెయ్యడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పబ్ లు మినహాయించి బార్ లు, బార్ అండ్ రెస్టారెంట్లలో మందు బాబులు పీకలదాక మద్యం సేవించడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. పబ్ లు మాత్రం ఓపెన్ చెయ్యకూడదని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

 రైట్ రైట్ నాయకా

రైట్ రైట్ నాయకా

కర్ణాటకలో అన్ని ఆర్ టీసీ, బీఎంటీసీ, ప్రైవేటు బస్సులతో పాటు అన్ని వాహనాల్లో పూర్తి సీట్లలో ప్రయాణికులు సంచరించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బెంగళూరులో సోమవారం నుంచి పూర్తిస్థాయిలో మెట్రో సేవలు అందించడానికి అధికారులు సిద్దం అయ్యారు. ఇంతకాలం మూలనపడిన ట్యాక్సీలు, ఆటోలు రోడ్ల మీదకు వచ్చేస్తున్నాయి. కోవిడ్ నియమాలు పాటిస్తూ 100 మందితో వివాహాలు, శుభకార్యాలు నిర్వహించుకోవడానికి చాన్స్ చిక్కింది. అంత్యక్రియల్లో పాల్గొనడానికి 20 మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు.

 వీటికి మోక్షం లేదు మిత్రమా !

వీటికి మోక్షం లేదు మిత్రమా !

సినిమా థియేటర్లు, పబ్ లు, క్రీడా పోటీల్లో ప్రేక్షకులు పాల్టొనడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. మతపరమైన కార్యక్రమాలు నిర్వహించకూడదని, రాజకీయ పార్టీల పబ్లిక్ మీటింగ్ లు నిర్వహించకూడదని, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మనవి చేశారు.

Recommended Video

Dr. Lasya Sai Sindhu, ENT and neurologist, said that doctors work hard to save the lives of patients
 హమ్మయ్యా...... మూడు నెలలకు లాక్ డౌన్ కు బ్రేక్

హమ్మయ్యా...... మూడు నెలలకు లాక్ డౌన్ కు బ్రేక్

మూడు నెలల నుంచి అమలులో ఉన్న లాక్ డౌన్ 3.0 నియమాలు ఈ రోజు (జులై 5వ తేది) నుంచి కర్ణాటకలో దాదాపు 90 శాతం సడలించడంతో ప్రజలతో పాటు వ్యాపారులు ఊపిరిపీల్చుకున్నారు. కర్ణాటకలో వీకెండ్ కర్ఫ్యూ పూర్తిగా ఎత్తివేశారు. ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి వేకువ జామున 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

English summary
Lockdown relaxation in Karnataka: Karnataka Govt Is Taken Back Weekend Curfew After 3 Months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X