వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటకలో లాక్‌డౌన్ రూల్స్: పుకార్లు ప్రచారం చేస్తే చర్యలు, పరీక్షలు పోస్ట్ పోన్ కాదు..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వాలు మరింత అలర్ట్ అయ్యాయి. కర్ణాటకలో పరిస్థితి తీవ్రంగా ఉంది. దీంతో లాక్ డౌన్ నిబంధనలు విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రులు, అధికారులు వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎం యడియూరప్ప సమీక్ష నిర్వహించారు. తర్వాత కఠినంగా రూల్స్ విధిస్తున్నామని ప్రకటించారు.

కేసులు పెరుగుతున్నందున ర్యాలీలు, ఆందోళనలకు అనుమతి లేదని స్పష్టంచేశారు. మరో 15 రోజులు కొనసాగుతాయని స్పష్టంచేశారు. ఎన్నికల ర్యాలీలపై కూడా నిషేధం కొనసాగుతోందని తేల్చిచెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్నందున భౌతికదూరం పాటించాలని ప్రజలను యడియూరప్ప కోరారు.

 Lockdown ruled out for now, no rallies in Karnataka

బెంగళూరులోని 8 జోన్లలో వైరస్ వ్యాప్తి గురించి 8 మంది ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. వీరు ఆయా ప్రాంతాల్లో కరోనా కేసుల గురించి పరిశీలించి.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. పెళ్లిళ్లకు హాజరయ్యే జనంపై కాస్త ఆందోళన ఉందని రెవెన్యూ మంత్రి అశోక తెలిపారు. కరోనా రూల్స్ బ్రేక్ చేస్తే ఫంక్షన్ హాల్ ఓనర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

పరీక్షలు వాయిదా ఉండబోవు అని విద్యాశాఖ మంత్రి సురేశ్ కుమార్ తెలిపారు. అయితే పరీక్షలకు సంబంధించి అన్నీ అంశాలను పరిశీలిస్తున్నామని తెలియజేశారు. పిల్లలకు స్కూల్‌లో అన్నీ జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు. కరోనా వల్ల పరీక్షలు పోస్ట్ పోన్ చేయం, చేయబోమని చెప్పారు.

English summary
Karnataka Chief Minister BS Yediyurappa on Monday ruled out lockdown in the state after holding a meeting with health officials to review the Covid situation.క
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X