lockdown: లాక్ డౌన్ లో గుడిలో ప్రేమ పెళ్లి, అదే లాక్ డౌన్ లో ఆత్మహత్య, నెల రోజుల్లో ఏం జరిగింది ?

చెన్నై/ తిరువణ్ణామలై: లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో అబ్బాయి కుటుంబ సభ్యులకు నచ్చచెప్పి గుడిలో ప్రేమ పెళ్లి చేసుకున్న నవ దంపతులు నెల రోజుల్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. లాక్ డౌన్ గడువులో ఇంట్లో ఉంటున్న నవ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో వారి కటుంబ సభ్యులు, బంధువులు షాక్ కు గురైనారు. ఒకరిని ఒకరు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారని, జీవితాంతం సంతోషంగా ఉంటారని అందరూ అనుకున్నారు. అయితే నవ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో అందరి అంచనాలు తల్లకిందులు అయ్యాయి. నవ వధువు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది.

 మూడేళ్లుగా ప్రేమికులు

మూడేళ్లుగా ప్రేమికులు

తమిళనాడులోని తిరుణ్ణామలై జిల్ల తానియంబట్టు తాలుకా మోదకాల్ గ్రామానికి చెందిన వేటియప్పన్ కుమారుడు జయకుమార్, క్రిష్ణగిరి జిల్లా కల్లూరు గ్రామానికి చెందిన విజయలక్ష్మికి నాలుగేళ్ల క్రితం పరిచయం అయ్యింది. పనిపై కల్లూరు వెళ్లి వస్తున్న జయకుమార్ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా ఉద్యోగం చేస్తున్న విజయలక్ష్మి ప్రేమలో పడ్డాడు. గత మూడేళ్ల నుంచి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు.

 పెళ్లికి నో చెప్పిన పెద్దలు

పెళ్లికి నో చెప్పిన పెద్దలు

జయకుమార్, విజయలక్ష్మి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించి వారి కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. అయితే జయకుమార్, విజయలక్ష్మిల పెళ్లి చెయ్యడానికి ఇరు కుటుంబ సభ్యులు నిరాకరించారు. తాను విజయలక్ష్మిని తప్ప వేరే యువతిని పెళ్లి చేసుకోనని, కావాలంటే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతానని జయకుమార్ తేల్చి చెప్పారు.

 లాక్ డౌన్ లో పెళ్లి

లాక్ డౌన్ లో పెళ్లి

జయకుమార్ మొండికి వెయ్యడంతో గత్యంతరం లేక ఆయన కుటుంబ సభ్యులు విజయలక్ష్మితో పెళ్లి చెయ్యడానికి అంగీకరించారు. అయితే విజయలక్ష్మి కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లికి అంగీకరించలేదు. ఏప్రిల్ 6వ తేదీన ఓ గ్రామంలోని ఆలయంలో జయకుమార్, విజయలక్ష్మి కేవలం 10 మంది సమక్షంలో చాలా సంతోషంగా పెళ్లి చేసుకున్నారు.

 సంతోషంగా ఉన్నారనుకుంటే ?

సంతోషంగా ఉన్నారనుకుంటే ?

వివాహం అయిన తరువాత జయకుమార్ సొంత గ్రాయం అయిన మోదకాల్ గ్రామంలోనే విజయలక్ష్మి ఉంటుంన్నది. నవ దంపతులు ఇద్దరు సంతోషంగా ఉన్నారని జయకుమార్ కుటుంబ సభ్యులు, బంధువులు భావించారు. రాత్రి గదిలోకి వెళ్లిన జయకుమార్, విజయలక్ష్మి మరుసటి రోజు ఎంతసేపు అయినా బయటకు రాకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఎంత సేపు తలుపులు తట్టినా, పిలిచినా వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తలుపులు పగలగొట్టి చూసి షాక్ కు గురైనారు.

 ఒకే ఫ్యాన్ కు వేరి వేసుకుని ఆత్మహత్య

ఒకే ఫ్యాన్ కు వేరి వేసుకుని ఆత్మహత్య

నవ దంపతులు జయకుమార్, విజయలక్ష్మి గదిలోని ఒకే ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు తానేపాడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలంలో పరిశీలించి జయకుమార్, విజయలక్ష్మి మృతదేహాలను పోస్టుమార్టుం చెయ్యడానికి తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన పెళ్లికి తన తల్లిదండ్రులు అంగీకరించలేదని విజయలక్ష్మి కలత చెందిందని, అదే విషయంలో నవ దంపతులు ఏమైనా ఆత్మహత్య చేసుకున్నారా ? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా ? అని దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+