Lodge: కాంట్రాక్టర్ ఆత్మహత్య, అదే లాడ్జ్ లో మెడికల్ రెప్ కూడా ?, దెయ్యం వచ్చిందా ?, హోమాలు చేసినా !
బెంగళూరు: బెళగావికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్, బీజేపీ నాయకుడు సంతోష్ పాటిల్ ఉడిపిలోని లాడ్జ్ లో డోత్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తన బిల్లలు చెల్లించడానికి 40 శాతం కమీషన్ అడిగారని ఆరోపిస్తూ ప్రముఖ కాంట్రాక్టర్, బీజేపీ నాయకుడు సంతోష్ పాటిల్ సీనియర్ మంత్రి కేఎస్. ఈశ్వరప్ప మీద ఆరోపణలు చేస్తూ డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య వ్యవహారంతో బీజేపీ సీనియర్ నాయకుడు కేఎస్. ఈశ్వరప్ప ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య చేసుకోవడంతో ఆ లాడ్జ్ లో ఇప్పటికే హోమాలు చేయించారు. ఇంకెవ్వరూ మా లాడ్జ్ లో ఆత్మహత్య చేసుకోకూడదని హోమం చేయించామని లాడ్జ్ యాజమాన్యం చెప్పింది. కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకుని 15 రోజులు కూడా కాకుండానే మరో యువకుడు అదే లాడ్జ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఆ లాడ్జ్ లోకి అడుగు పెట్టాలంటే చాలా మంది భయపడిపోతున్నారు.

ప్రముఖ కాంట్రాక్టర్
బెళగావికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్, బీజేపీ నాయకుడు సంతోష్ పాటిల్ ఉడిపిలోని శాంభవి లాడ్జ్ లో డోత్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తన బిల్లలు చెల్లించడానికి 40 శాతం కమీషన్ అడిగారని ఆరోపిస్తూ ప్రముఖ కాంట్రాక్టర్, బీజేపీ నాయకుడు సంతోష్ పాటిల్ సీనియర్ మంత్రి కేఎస్. ఈశ్వరప్ప మీద ఆరోపణలు చేస్తూ డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

మంత్రి పదవి పోయింది
కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య వ్యవహారంతో బీజేపీ సీనియర్ నాయకుడు కేఎస్. ఈశ్వరప్ప ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని కేఎస్ ఈశ్వరప్ప అంటున్నారు. ఆ రోజు కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ తో పాటు శాంభవి లాడ్జ్ లో ఉన్న అతని స్నేహితులను పోలీసులు విచారణ చేస్తున్నారు.

లాడ్జ్ లో హోమాలు చేయించారు
కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య చేసుకోవడంతో ఉడపిలోని శాంభవి లాడ్జ్ లో ఇప్పటికే గణపతి హోమంతో పాటు అనేక హోమాలు చేయించారు. ఇంకెవ్వరూ మా లాడ్జ్ లో ఆత్మహత్య చేసుకోకూడదని, ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకూడదని హోమం చేయించామని శాంభవి లాడ్జ్ యాజమాన్యం చెప్పింది

మెడికల్ రెప్ ఆత్మహత్య
కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకుని 15 రోజులు కూడా కాకుండానే మంగళూరుకు చెందిన శరణ్ (33) అనే యువకుడు అదే శాంభవి లాడ్జ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మెడికల్ రెప్ గా ఉద్యోగం చేస్తున్న శరణ్ పనిమీద ఉడిపి వచ్చి శాంభవి లాడ్జ్ లో బసచేశాడని పోలీసు అధికారులు అంటున్నారు. ఇప్పుడు ఆ లాడ్జ్ లోకి అడుగు పెట్టాలంటే చాలా మంది భయపడిపోతున్నారు.












Click it and Unblock the Notifications