మోడీ: అమిషా పటేల్ షో, బైక్‌పై గుల్ పనాగ్ (పిక్చర్స్)
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. తొమ్మిది దఫాలుగా దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ నెల 12వ తేదీన మరో 41 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. అది తొమ్మిదో దఫా. దీంతో పోలింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. 16వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
ఆయా పార్టీల అభిమానులు, కార్యకర్తలు మే 16వ తేదీ కోసం ఊపిరి బిగపట్టి ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 30న తెలంగాణలో, మే 7న సీమాంధ్రలో పోలింగ్ జరిగింది. చివరి దఫాలో ఎక్కువ సీట్లు దక్కించుకునేందుకు నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు.

సోనియా గాంధీ
ఖుషీనగర్‌లోని పద్రౌన ప్రాంతంలో జరిగిన ప్రచారంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో కలిసి కాంగ్రెసు పార్టీ నేత ఆర్పీఎన్ సింగ్ దృశ్యం

సోనియా గాంధీ
ఖుషీనగర్‌లోని పద్రౌన ప్రాంతంలో గురువారం జరిగిన ప్రచార సభలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతున్న దృశ్యం. పక్కన పార్టీ నేతలు అంబికా సోనీ, ఆర్పీఎన్ సింగ్‌లు ఉన్నారు.

అరవింద్ కేజ్రావాల్
ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) సమన్వయకర్త, ఢిల్లీ మాజీ ముఖ్యంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో గంగా హారతిలో పాల్గొన్నారు.

మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ గురువారం ఎన్నికల ప్రచారం సందర్భంగా కళ్లు తుడుచుకూంటూ... ఆమె ఉత్తర 24 పరగణాల జిల్లాలోని తీతగర్తాలో పార్టీ అభ్యర్థి దినేష్ త్రివేది తరఫున ప్రచారం నిర్వహించారు.

వికాస్
ప్రముఖ గాయకులు వికాస్... ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ...

అమిషా పటేల్
ప్రముఖ బాలీవుడ్ నటి అమిషా పటేల్, కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకులు రాజీవ్ శుక్లాలు గురువారం ఉత్తర ప్రదేశ్‌లోని జాన్‌పూర్‌లో రోడ్డు షో నిర్వహించారు. అమిషాను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

గుల్ పనాగ్
ప్రముఖ నటి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) సమన్వయకర్త గుల్ పనాక్ ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో అరవింద్ కేజ్రీవాల్ కోసం ప్రచారం చేయడం కోసం బైక్ ఎక్కారు.

రాహుల్ గాంధీ
ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గురువారం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభివాదం చేస్తూ...

మోడీ అభిమాని
ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఓ అభిమాని గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పట్ల అభిమానం ప్రదర్శిస్తున్న దృశ్యం.

మోడీ
గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గురువారం ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో రోడ్డు షో నిర్వహించారు.

మమతా బెనర్జీ
గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పైన తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన మాటల దాడిని మరింత పెంచారు. మోడీ ఫర్ పిఎం ఫండ్ ఏమిటని ఆమె ప్రశ్నించారు.

మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ గురువారం ఎన్నికల ప్రచారం సందర్భంగా కళ్లు తుడుచుకూంటూ... ఆమె ఉత్తర 24 పరగణాల జిల్లాలోని తీతగర్తాలో పార్టీ అభ్యర్థి దినేష్ త్రివేది తరఫున ప్రచారం నిర్వహించారు.

నరేంద్ర మోడీ
గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గురువారం ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పైన అభిమానులు పూలు చల్లారు.

రాహుల్ గాంధీ
ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గురువారం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నీళ్లు తాగుతూ...

రాహుల్
ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గురువారం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గల షాహిద్ మందిర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.












Click it and Unblock the Notifications