ఓటు వేసిన దేవర హీరోయిన్
Devara: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అయిదో విడత పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరి నిల్చున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా- ఇప్పటివరకు నాలుగు విడతల్లో పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీ సహా మొత్తం 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ ఈ నెల 13వ తేదీన పూర్తయింది. అయిదో విడత పోలింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇంకా రెండు విడతల ఓటింగ్ మిగిలివుంది. ఈ నెల 26, జూన్ 1 తేదీల్లో చివరి రెండు విడతల పోలింగ్ ముగుస్తుంది. 4వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి.

అయిదో దశలో ఎనిమిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 49 లోక్‌సభ స్థానాలకు సోమవారం పోలింగ్ జరుగనుంది. ఉత్తరప్రదేశ్- 14, మహారాష్ట్ర- 13, పశ్చిమ బెంగాల్-7, బిహార్- 5, ఒడిశా- 5, జార్ఖండ్- 3, కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్- 1, లఢక్- 1 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాలు కూడా పోలింగ్ జరుగుతోంది. ఈ రెండు హైఓల్టేజ్ సీట్లు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాయ్‌బరేలీ- రాహుల్ గాంధీ, అమేథీ- స్మృతి ఇరానీ, లక్నో- రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా నుంచి మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పోటీలో ఉన్నారు.
ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ఏఐసీసీ మాజీ అధినాయకురాలు సోనియా గాంధీ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సారి ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సోనియా గాంధీ ఖాళీ చేసిన స్థానం కావడం వల్ల ఆమె కుటుంబమే ఇక్కడి నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ భావించింది. రాహుల్ గాంధీని బరిలో దింపింది.
#WATCH | Bollywood Actress Janhvi Kapoor casts her vote at a polling station in Mumbai for #LokSabhaElections2024
— ANI (@ANI) May 20, 2024
"Please come out and vote, " she says pic.twitter.com/5Ki6JH30Et
దేశ ఆర్థిక రాజధాని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. పలువురు పారిశ్రామిక దిగ్గజాలు, బాలీవుడ్ సెలెబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. క్యూలో నిల్చొని మరీ ఓటు వేస్తోన్నారు.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, నటి జాన్వీ కపూర్.. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. జాన్వీ కపూర్.. ప్రస్తుతం తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇదే ఆమెకు తొలి తెలుగు ఫిల్మ్. నటుడు ఫర్హాన్ అఖ్తర్, జోయా అఖ్తర్, పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఓటు వేశారు.












Click it and Unblock the Notifications