ఎన్నికలకు సోనియా గాంధీ గుడ్ బై?

Lok Sabha 2024: దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. మార్చిలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.

Lok Sabha election 2024: Sonia Gandhi will opt for a Rajya Sabha berth: Reports

ఈ పరిణామాల మధ్య అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత్రి, లోక్‌సభ సభ్యురాలు సోనియా గాంధీ.. ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని యోచిస్తోన్నట్లు సమాచారం. ఆరోగ్యం సహకరించకపోవడం ఒక కారణం కాగా.. తన కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కోసం తన సీటును కేటాయించాలనుకోవడం మరో కారణంగా చెబుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు సోనియా గాంధీ. 2004 నుంచీ క్రమం తప్పకుండా ఈ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సృష్టించిన 2014, 2019 ఎన్నికల్లోనూ సోనియాకు ఎదురు లేకుండా పోయింది.

ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఇదే స్థానం నుంచి ఆమె పోటీ చేయడం లాంఛనప్రాయమేనని భావిస్తోన్న నేపథ్యంలో- వెలుగులోకి వచ్చిన ఈ వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి దూరంగా ఉంటారని చెబుతున్నారు. ఈ మేరకు పార్టీ యంత్రాంగానికి సంకేతాలను సైతం పంపించారని అంటున్నారు.

Lok Sabha election 2024: Sonia Gandhi will opt for a Rajya Sabha berth: Reports

రాయ్‌బరేలీ స్థానాన్ని ప్రియాంక గాంధీ వాద్రాకు కేటాయిస్తారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. లోక్‌సభకు బదులుగా ఈ సారి రాజ్యసభకు ఎన్నిక కావాలనే యోచనలో సోనియా ఉన్నారని అంటున్నారు. దీనికితోడు రాయబరేలీలో సోనియా గాంధీని ఓడించడానికి బీజేపీ భారీ స్కెచ్ వేస్తోండటం కూడా దీనికి ఓ కారణమని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీ పరాజయం పాలైన విషయం తెలిసిందే.

ప్రస్తుతం రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలాన్ని లెక్కిస్తే.. ఒక్కొక్క రాజ్యసభ స్థానాన్ని ఆ పార్టీ గెలుచుకుంటుంది. కర్ణాటక, తెలంగాణ నుంచి మూడు లేదా నాలుగు స్థానాలు దక్కొచ్చు. వీటిల్లో ఏదో ఒక రాష్ట్రం నుంచి రాజ్యసభకు నామినేట్ అవుతారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+