మోదీ.. కాషాయరంగు డ్రెస్ కోడ్

Lok Sabha election 2024 phase 3 Voting: మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ఆరంభమైంది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 93 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా స్థానాల పరిధిలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు.

ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. కిందటి నెల 19వ తేదీన 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు తొలి విడతలో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. 26వ తేదీన 13 రాష్ట్రాల్లో 88 స్థానాల్లో పోలింగ్ ముగిసింది. మొత్తంగా 190 సీట్లల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Lok Sabha elections 2024 PM Modi and Amit Shah casts vote at Ahmedabad

మూడో విడతలో కర్ణాటక, అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ దామన్, గోవా, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లల్లో పోలింగ్ కొనసాగుతోంది.

గుజరాత్‌లో గల లోక్‌సభ 25 లోక్‌సభ స్థానాలకూ పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ మొత్తం 26 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. 25 సీట్లకు పోలింగ్ నిర్వహిస్తోన్నారు. సూరత్ స్థానం ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి వేసిన నామినేషన్‌ను తిరస్కరణకు గురైంది. ఫలితంగా- సూరత్ స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Lok Sabha elections 2024 PM Modi and Amit Shah casts vote at Ahmedabad

ఈ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ లోక్‌సభ పరిధిలో వారిద్దరికీ ఓటు హక్కు ఉంది. అహ్మదాబాద్ సిటీలోని నిషాన్ హై సెకెండరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కొద్దిసేపటి కిందటే వారు ఓటు వేశారు.

ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా హస్‌‌ముఖ్ సోమాభాయ్ పటేల్ పోటీలో ఉన్నారు. బీజేపీ కంచుకోట గాంధీనగర్ నుంచి అమిత్ షాలో ఉన్న విషయం తెలిసిందే. ఓటు వేసిన అనంతరం మోదీ, అమి్త్ షా వేర్వేరుగా ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లనున్నారు. అక్కడ నాలుగో విడత ఎన్నికల ప్రచారంలో వాళ్లు పాల్గొనాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+