వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రంతో ఢీకి కేసీఆర్ రెడీ: ఆ సీఎంల అండ, జయ కోసం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: హైదరాబాద్ పైన అధికారాలను గవర్నర్‌కు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన సర్క్యులర్‌ను వ్యతిరేకిస్తూ సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లోనూ వాయిదా తీర్మానం ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు పార్టీ ఎంపీలను ఆదేశించారు. రాష్ట్ర జాబితాలోని శాంతిభద్రతల అధికారాలను గవర్నర్‌కు కట్టబెట్టటం రాజ్యాంగ విరుద్ధమనే వాదనను పార్లమెంటు వేదికగా బలంగా వినిపించాలని వారికి నిర్దేశించారు.

ఈ విషయంలో కేంద్ర వైఖరిని జాతీయ స్థాయిలో తీవ్రంగా ఎండగట్టాలని సూచించారు. టీఆర్‌ఎస్‌పీపీ నేత కేశవరావు, లోకసభలో పార్టీ పక్ష నేత జితేందర్‌ రెడ్డి ఆదివారం కేసీఆర్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. హైదరాబాద్‌లో ప్రత్యేకించి జీహెచ్‌ఎంసీ పరిధిలో శాంతి భద్రతల అధికారాలను గవర్నర్‌కు దఖలుపరుస్తూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన సర్క్యులర్‌ను సమావేశాల్లో ఏ రకంగా వ్యతిరేకించాలి, ఉభయ సభల్లోనూ అనుసరించాల్సిన వ్యూహం ఏమిటనే అంశాలపై ప్రధానంగా చర్చించారు.

ఈ అంశాన్ని సభలో లేవనెత్తటానికి ఇటు లోకసభలో, అటు రాజ్యసభలో వాయిదా తీర్మానాలు ఇవ్వా లని జితేందర్ రెడ్డిని, కేకేను కేసీఆర్‌ కోరారు. సభాపతులు చర్చకు అనుమతిస్తే, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా.. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలకు కత్తెర పెడుతూ గవర్నర్‌కు శాంతిభద్రతల నిర్వహణ బాధ్యతలను అప్పగించిన కేంద్రాన్ని లోకసభ, రాజ్యసభల సాక్షిగా నిలదీయాలని వారికి స్పష్టం చేశారు.

ఈ మేరకు పలువురు పార్టీ ఎంపీలు రాషా్ట్రల అధికారాలకు సంబంధించి రాజ్యాంగంలో పొందుపర్చిన వివరాల అధ్యయనాన్ని ప్రారంభించారు. ఒకవేళ, తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలను సభాపతులు అంగీకరించకపోతే ఉభయ సభలను స్తంభింపచేయాలనే వ్యూహాన్ని ఖరారు చేశారు. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి అక్కడే బైఠాయించాలని నిర్ణయించారు. పార్లమెంటులోనే కాకుండా బయట కూడా అందరి దృష్టిని ఆకర్షించేలా మన వాదనను గట్టిగా వినిపించాలని కేసీఆర్‌ చెప్పారు.

 కేసీఆర్

కేసీఆర్

హైదరాబాదు అధికారాలను గవర్నర్‌కు అప్పగించే విషయమై ఇతర రాష్ట్రాలలోని అధికార, ముఖ్య పార్టీలను కలుపుకు పోవాలని తెరాస భావిస్తోంది.

 గవర్నర్‌కు అధికారాలు

గవర్నర్‌కు అధికారాలు

ఇందులో భాగంగా కేసీఆర్ పలువురు నేతలతో సంప్రదించారట. ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ... ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలతో కేసీఆర్ ఇప్పటికే మాట్లాడారని చెప్పారు.

గవర్నర్‌కు అధికారాలు

గవర్నర్‌కు అధికారాలు

తృణమూల్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు, బీజేడీ పార్లమెంటు సభ్యులు తెరాస ఎంపీలకు మద్దతుగా నిలబడే అవకాశముంది.

గవర్నర్‌కు అధికారాలు

గవర్నర్‌కు అధికారాలు

బీహార్‌లో అధికారంలో ఉన్న జేడీ(యు), పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్, ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేడీ పార్టీల ఎంపీలు తెరాసకు మద్దతుగా నిలిచే అవకాశముంది.

గవర్నర్‌కు అధికారాలు

గవర్నర్‌కు అధికారాలు

మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మద్దతు కోసం కూడా కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే, ఈ అంశంపై కోర్టు తలుపు తడితే కేంద్ర హోం శాఖ జారీ చేసిన సర్క్యులర్‌ ప్రాథమిక స్థాయిలోనే కొట్టుకుపోతుందని రాజ్యాంగం, న్యాయశాస్త్రంపై అవగాహన కలిగిన టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు. అందుకే, రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందే సమయంలో గవర్నర్‌కు అధికారాలను అప్పగించే విషయంలో తాము ఉద్దేశపూర్వకంగానే మౌనం పాటించామని వారు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు.

English summary
All the 10 MPs from the TRS are determined to create pandemonium in Lok Sabha on Monday over the Centre granting special powers to the Telangana Governor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X