బీజేపీ 6వ జాబితా విడుదల: ఆ రెండు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఖరారు, సిట్టింగ్‌లకు నో ఛాన్స్
న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (BJP) మంగళవారం తన ఆరవ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఆరో జాబితాలో రాజస్థాన్‌లోని రెండు స్థానాలు, మణిపూర్‌లోని ఒక స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. రాజస్థాన్‌లోని దౌసా లోక్‌సభ స్థానం నుంచి కన్హయ్య లాల్ మీనాను, కరౌలీ-డోల్‌పూర్ స్థానం నుంచి ఇందూ దేవిని బీజేపీ పోటీకి దింపింది.
కాగా, మణిపూర్ ఇన్నర్ స్థానం నుంచి తౌనోజం బసంత కుమార్ సింగ్ బరిలోకి దిగారు.
ఈ మూడు స్థానాల నుంచి బీజేపీ తన సిట్టింగ్ ఎంపీలందరినీ పక్కకుపెట్టడం గమనార్హం. కేంద్ర మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్‌తో సహా, అతని స్థానంలో తౌనోజం బసంత కుమార్ సింగ్‌ని నియమించారు. రాజస్థాన్‌లోని రెండు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంపీలు మనోజ్ రజోరియా (కరౌలి-డోల్పూర్ స్థానం), జస్కౌర్ మీనా (దౌసా)లను బీజేపీ వదులుకుంది.

కాగా, మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గానూ ఇప్పటి వరకు 401 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను మార్చి 2న ప్రకటించింది. తొలి జాబితాలో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ సహా 34 మంది కేంద్ర ప్రభుత్వ మంత్రులను బీజేపీ బరిలోకి దింపింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి స్థానంలో ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేయనున్నారు.
మార్చి 13న పార్టీ రెండో అభ్యర్థుల జాబితా విడుదలైంది. లోక్‌సభ ఎన్నికలకు మరో 72 మంది అభ్యర్థుల పేర్లను అందులో పేర్కొంది. రెండో జాబితాలో అనురాగ్ ఠాకూర్, మనోహర్ లాల్ ఖట్టర్, పీయూష్ గోయల్, అనిల్ బలూనీలకు చోటు దక్కింది.
తొమ్మిది మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను మార్చి 21న విడుదల చేశారు. బీజేపీ మూడో అభ్యర్థి జాబితా ప్రకారం.. తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై కోయంబత్తూరు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు, కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ నీలగిరి నుంచి పోటీ చేయనున్నారు.
15 మంది అభ్యర్థులతో కూడిన నాల్గవ జాబితాను మార్చి 22న విడుదల చేశారు. మార్చి 25న విడుదల చేసిన 111 మంది అభ్యర్థులతో కూడిన ఐదవ జాబితాలో సినీ నటులు కంగనా రనౌత్, అరుణ్ గోవిల్ పేర్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19, జూన్ 1 మధ్య జరగనున్నాయి. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications