సంస్కృతంలో సుష్మ, అశోక్ తెలుగు: విభజనపై ప్రకటన

న్యూఢిల్లీ: 16వ లోకసభలో రెండో రోజు సభ్యులచే ప్రొటెం స్పీకర్ కమల్ నాథ్ గురువారం ప్రమాణం చేయిస్తున్నారు. కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్ సంస్కృతంలో, అశోక గజపతి రాజు తెలుగులో ప్రమాణం చేశారు. లోకసభ సభ్యులుగా ప్రధాని నరేంద్ర మోడీ, సీనియర్ నేత అద్వానీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తదితరులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సభ్యులు ఒక్కరొక్కరిచే ప్రమాణం చేయిస్తున్నారు.

మూడు స్థానాలు ఖాళీ

సార్వత్రిక ఎన్నికల్లో మూడు లోకసభ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రొటెం స్పీకర్ కమల్ నాథ్ చెప్పారు. వడోదర (మోడీ), మెదక్ (కెసిఆర్), మైన్‍‌పురి (ములాయం సింగ్ యాదవ్) స్థానాలు ఖాళీ అయినట్లు చెప్పారు. లోకసభ సభ్యుల రాజీనామాను ఆమోదించారు.

Lok Sabha session: Modi and other leaders take oath

జూన్ 2 నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అమల్లోకి...

జూన్ 2వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అమలులోకి వచ్చినట్లు కమల్ నాథ్ గురువారం ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ నుండి ప్రమాణ స్వీకారం చేసిన వారిలో... అశోక గజపతి రాజు, కొత్తపల్లి గీత, రామ్మోహన నాయుడు, కంభంపాటి హరిబాబు, ముత్తంశెట్టి శ్రీనివాస్, గోకరాజు రంగరాజు, మాగంటి బాబు, మురళీ మోహన్, తోట నరసింహం, రవీంద్ర బాబు, కేశినేని నాని, కొణకళ్ల నారాయణ, గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివ రావు, మాల్యాద్రి, వైవి సుబ్బారావు, మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక, జెసి దివాకర్ రెడ్డి, నిమ్మల కిష్టప్ప, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, వర ప్రసాద్‌లు ఉన్నారు. జెసి, మేకపాటి, అశోక్, నిమ్మల కిష్టప్ప, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, మురళీ మోహన్ తదితరులు కొందరు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+