లోకసభలో గందరగోళం: ఆరుగురు కాంగ్రెస్ ఎంపీల సస్పెండ్
సభా కార్యకలాపాలకు విఘాతం కల్పిస్తున్నారన్న కారణంతో కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు.
న్యూఢిల్లీ: గోసంరక్షణ పేరుతో జరుగుతున్న దాడుల అంశంపై చర్చించాలని లోక్‌సభలో సోమవారం ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. మొదట ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని చర్చించాలని కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు డిమాండ్ చేశాయి. అయితే జీరో అవర్‌లో ఈ అంశాన్ని చర్చిద్దామని స్పీకర్ సుమ్రితా మహాజన్ అన్నారు.
అయినా, ప్రతిపక్షాలు శాంతించలేదు. ప్రశ్నోత్తరాలను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అయితే బీజేపీ సభ్యులు మాత్రం బోఫోర్స్ కుంభకోణంపై చర్చించాలని నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సంయమనం పాటించాలని సభ్యులను స్పీకర్ కోరినా వారు వినిపించుకోలేదు.

అంతేగాకుండా స్పీకర్ సుమిత్రా మహాజన్‌పై కాంగ్రెస్ సభ్యులు కాగితాలు చించి విసరేశారు. దీంతో గందరగోళం నెలకొంది. సభా కార్యకలాపాలకు విఘాతం కల్పిస్తున్నారన్న కారణంతో కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు లోక్‌సభ సభ్యులను స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెండ్ చేశారు. ఆరుగురిని 5రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండైన వారిలో ఆధిర్ రంజన్ ఛౌదురి, రంజీత్ రంజన్, సుస్మిత దేవ్, గౌరవ్ గగోయ్, కె.సురేష్, ఎంకే రాఘవన్‌లు ఉన్నారు.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications