సూపర్ స్టార్ కృష్ణ మృతికి లోక్ సభ నివాళి- ములాయం సహా మరో ఏడుగురు ఎంపీలకూ..
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. లోక్ సభ, రాజ్యసభ లో ఇవాళ ఉదయం సభా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇరుసభల్లోనూ సభ్యుల నిరసనలతో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ మధ్యే మృతిచెందిన పలువురు సభ్యులకు లోక్ సభ నివాళులు అర్పించింది.
ఏపీకి చెందిన దివంగత సూపర్ స్టార్ కృష్ణకు లోక్ సభ నివాళులు అర్పించింది. లోక్ సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ఆనవాయితీ ప్రకారం సమావేశాలకు ముందు చనిపోయిన మాజీ ఎంపీలకు వారి పేర్లు, వివరాలు చదివి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ పేరు కూడా ప్రస్తావించారు. కృష్ణతో పాటు ఈ మధ్యే చనిపోయిన సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, మరో ఆరుగురు దివంగత ఎంపీలకు లోక్ సభ స్పీకర్ సభ తరఫున నివాళులు అర్పించారు.

ములాయం సింగ్ యాదవ్ నుంచి వరుసగా నివాళులు అర్పిస్తూ వచ్చిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా.. చివరిగా సూపర్ స్టార్ కృష్ణకు నివాళులు అర్పించారు. ఏలూరు నియోజకవర్గం నుంచి 9వ లోక్ సభ సభ్యుడిగా కృష్ణ పనిచేశారని స్పీకర్ పేర్కొన్నారు.50 ఏళ్లలో 350కి పైగా సినిమాల్లో ఆయన నటించారని గుర్తుచేసుకున్నారు. 2009లో పద్మభూషణ్ అవార్డు కూడా ఆయన్ను వరించిందన్నారు. సూపర్ స్టార్ కృష్ణగా పిలుచుకునే ఆయన నవంబర్ 15న కన్నుమూశారని స్పీకర్ ఓం బిర్లా సభ్యులకు తెలిపారు.












Click it and Unblock the Notifications