చికిత్సకు స్పందిస్తున్న జయలలిత, లండన్ డాక్టర్ వల్లే: కార్యకర్తల కన్నీళ్లు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చికిత్సకు స్పందిస్తున్నారని, ఆమెకు మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే చికిత్స అందించాలని అపోలో ఆసుపత్రి వర్గాలు ఆదివారం నాడు వెల్లడించాయి. జయలలిత ఆరోగ్యం పైన హెల్త్ బులెటిన్ విడుదల చేసారు.
లండన్ డాక్టర్ జాన్ రిజర్డ్స్ బాలే అమ్మకు వైద్యం అందించారని చెప్పారు. ఆయన సలహాతో మరికొన్ని రోజులు చికిత్స అందించాల్సి ఉందన్నారు. కోర్సు పూర్తయ్యేదాకా జయలలిత ఆసుపత్రిలోనే ఉంటుందని తెలిపారు. రిచర్డ్స్ బాలే చికిత్సతో కోలుకుంటున్నారని చెప్పారు.

వైద్యులను కలిసిన తమిళనాడు మంత్రులు
తమిళనాడుకు చెందిన పలువురు మంత్రులు ఆదివారం నాడు అపోలో ఆసుపత్రి డాక్టర్లను కలిశారు. జయలలిత ఆరోగ్యం పైన చర్చించారు.

మరోవైపు అమ్మ ఆరోగ్యం గురించి అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అపోలో ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున మహిళలు, అభిమానులు తరలి వచ్చారు. అమ్మ ఆరోగ్యం గురించి వాళ్లు కన్నీళ్లు కారుస్తున్నారు.












Click it and Unblock the Notifications