ఐసిస్ ఒంటరి తోడేలు దాడులకు అవకాశం!

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ మద్దతుదారులు భారతదేశంలో దాడులకు తెగబడే అవకాశం ఉందని కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాయి.

గణతంత్ర దినోత్సవం సందర్బంగా అన్ని రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చెయ్యాలని కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు సూచించాయి. ఐఎస్ఐఎస్ దాడులు చేసే అవకాశం ఉందని వెలుగు చూడటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

కేంద్ర నిఘా సంస్థలు, దర్యాప్తు సంస్థలు, 13 రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉన్న విషయం వాస్తవమే అని అధికారులు నిర్ధారించారు.

 Lone Wolf attack possible on Republic Day in India !

గణతంత్ర దినోత్సవాల వరకు అప్రమత్తంగా ఉండాలి అంటూ అందరినీ ఆదేశించామని కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులు తెలిపారు. ఏదైనా హింసాత్మక దాడికి పాల్పడే వ్యక్తిని ఒంటరి తోడేలు (లోన్ వోల్ఫ్)గా అభివర్ణిస్తారని అధికారులు అంటున్నారు.

2015 డిసెంబర్ నెలలో జైపూర్ లో సిరాజుద్దిన్ అనే వ్యక్తి ఇదే విధంగా దాడి చెయ్యడానికి వెళుతున్న సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు ఒంటరి తోడేలు దాడులకు అవకాశం ఉందని వెలుగు చూసింది.

మత పెద్దలు, కొందరు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సహకారంతో యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులు అవుతున్నారని అధికారులు, వారిని అడ్డుకొవడానికి తీసుకుంటున్న చర్యల వివరాలను ఇదే సందర్బంలో అధికారులు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+