కిలాడీ స్టార్ హీరోయిన్.. రూ. కోట్లు ధోకా: లుకౌట్ నోటీస్

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలపై ముంబై పోలీసులు లుకౌట్ సర్కులర్ జారీ చేశారు. 60 కోట్ల రూపాయల ఆర్థిక మోసానికి సంబంధించిన కేసులో ఈ నిర్ణయం తీసుకున్నారు. మూతపడ్డ బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్‌లో పెట్టుబడి డీల్ పేరుతో ఓ వ్యాపారవేత్తను మోసం చేసినట్లు ఆరోపణలు శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాపై ఉన్నాయి. ఈ కేసులో ఎకనామికల్ అఫెన్స్ వింగ్ అడుగు పెట్టింది. ముంబై పోలీసులతో కలిసి విచారణ చేపట్టింది.

దేశం విడిచి పారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ముంబై పోలీసులు ముందు జాగ్రత్తచర్యగా శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాపై ఈ లుక్ అవుట్ నోటీస్ జారీ చేసినట్లు చెబుతున్నారు. వారిద్దరి ప్రయాణాలపై నిఘా వేశారు. వారి రోజువారీ షెడ్యూల్ ను నిశితంగా పరిశీలిస్తోన్నారు. బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీ ఆడిటర్‌ను కూడా విచారణ నిమిత్తం పిలిపించారు. దీంతో ఈ కేసు మరింత జటిలంగా మారింది. వారిని అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు.

Look out notice have been issued against Shilpa Shetty and Raj Kundra

దీపక్ కొఠారి అనే వ్యాపారవేత్త శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాపై ఫిర్యాదుదారు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు, ఆరోపణల ప్రకారం.. 2015 నుండి 2023 మధ్య కాలంలో శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా 60 కోట్ల రూపాయలను తీసుకున్నారు. బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్‌ కార్యకలాపాలను విస్తరించబోతోన్నామని, వ్యాపార భాగస్వామి కావడం వల్ల అందులో వాటాలు ఇస్తామని నమ్మబలికారు. ఈ మొత్తాన్ని కూడా తమ సొంత ఇతర వ్యాపారాలు, వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించినట్లు కొఠారి పేర్కొన్నారు.

కొఠారి.. లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్. రాజేష్ ఆర్య అనే వ్యక్తి తనను శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాకు పరిచయం చేశాడని, ఆ సమయంలో వారు బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ అనే హోమ్ షాపింగ్, ఆన్‌లైన్ రిటైల్ ప్లాట్‌ఫామ్‌కు డైరెక్టర్లుగా ఉన్నారని, అందులో 87.6 శాతం కలిగి వాటాలు ఉన్నట్లు

ఈ డబ్బును మొదట రుణంలా తీసుకున్నప్పటికీ.. ఆ తర్వాత మాటమార్చారని, ట్యాక్స్ సేవింగ్స్ లో పెట్టుబడిగా చూపారని దీపక్ కొఠారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఇచ్చిన 60 కోట్ల రూపాయలను మొత్తాన్ని 12 శాతం వార్షిక వడ్డీతో కలిపి నిర్ణీత సమయంలో తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారని కొఠారి చెప్పారు. 2016 ఏప్రిల్‌లో శిల్పాశెట్టి స్వయంగా రాతపూర్వక హామీ ఇచ్చారని కొఠారి పేర్కొన్నారు. ఇప్పటివరకు కూడా దీని గురించి ఊసే ఎత్తట్లేదని తన ఫిర్యాదులో పొందుపరిచారు.

కొన్ని నెలల్లోనే శిల్పాశెట్టి బెస్ట్ డీల్ కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఆ కంపెనీ అప్పటికే దివాలా తీసిందని, దానిపై 1.28 కోట్ల రూపాయల కేసు సైతం నడుస్తోందనే విషయం తనకు తెలియవచ్చిందని కొఠారి వివరించారు. దీన్ని దాచిపెట్టి 60 కోట్ల రూపాయలను తీసుకున్నారని తెలిపారు. కాగా- ఈ ఆరోపణలను శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా ఇదివరకే ఖండించారు. ఇది తమను అప్రతిష్టపాలు చేయడానికి ఉద్దేశించిన నిరాధారమైన, దురుద్దేశపూరితమైన కేసు అని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+